రిషి సునాక్ ను పుతిన్ అందుకే అభినందించలేదట..!

0
847

బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను ప్రపంచ దేశాల నేతలు అభినందిస్తున్న సంగతి తెలిసిందే..! అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో సర్వత్రా కాస్త ఉత్కంఠ నెలకొంది. రిషిని పుతిన్ ఎందుకు అభినందించలేదన్న దానిపై రష్యా అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. బ్రిటన్ ఇప్పుడు తమ విరోధి దేశాల జాబితాలో ఉందని, అందుకే రిషికి పుతిన్ శుభాకాంక్షలు చెప్పలేదని.. పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. సునాక్ నేతృత్వంలోని బ్రిటన్‌తో రష్యా సంబంధాలు మెరుగయ్యే అవకాశాలేమీ కనిపించడం లేదని అన్నారు. ఇక ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ రిషి మాట్లాడాడు. తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇది కూడా రష్యాకు రిషిపై కోపం పెరిగేలా చేసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

రిషి సునాక్‌ ఇక దేశ ఆర్థిక వ్యవస్థను కుదుటపరచడానికి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అందులో భాగంగా కీలక క్యాబినెట్‌ నియామకాలను చేపట్టారు. సౌయెల్లా బ్రేవర్మన్‌ను హోం శాఖ కార్యదర్శిగా తిరిగి తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేందుకు కొత్త చాన్సలర్‌గా జెరెమీ హంట్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. జేమ్స్‌ క్లావర్లీని విదేశాంగ కార్యదర్శిగా కొనసాగించనున్నారు.