International

గల్వాన్ ఘర్షణలకు సంబంధించిన వీడియో లీక్ వెనుక అసలు కారణాలేంటి?

నిజమనేది… నిలకడ మీదనే తెలుస్తోంది.! అందుకోసం కొంత టైమ్ పడుతుంది.! అప్పటి వరకు కాసింత వెయిట్ చేయాలి అంతే.! చైనా అబద్దాలకోరు అని మనకు బాగా తెలుసు.! తన దేశ ప్రజలకు అది ఎప్పుడు నిజాలు చెప్పదు. వారిని భ్రమల్లోనే ఉంచుతూ ఉంటుంది. అక్కడ మీడియా అంతా కమ్యూనిస్టు పార్టీ కంట్రోల్ లోనే ఉంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ సెన్సార్ చేసిన తర్వాతే వార్త ప్రసారం ఆన్ ఏయిర్ అవుతుంది. చైనా ప్రజలకు కనీస పౌర హక్కులు ఉంటాయా? వారికి భావన ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుందా?దీనిపై మన దేశంలోని చైనా తాబేదారులే చెప్పాలి.
అంతేకాదు… చైనా కమ్యూనిస్టు పాలకులు తమ దేశంలో పాశ్చాత్య మీడియాను అనుమతించరు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయమో తెలియదు కానీ.. ప్రతి విషయాన్ని చైనా పాలకులు దాచేస్తేంటారు.
గత రెండేళ్లుగా భారత్, చైనాల మధ్య.., తూర్పు లద్దాఖ్ లోని ఎల్ఏసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది జూన్ 15న జరిగిన గల్వాల్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. గల్వాన్ లోయలోని పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైనికులు అక్రమ కట్టడాలు ఏర్పాటు చేయడంతో ఈ ఘర్షణ మొదలైంది. భారత దళాలు ఆ ఆక్రమ కట్టడాలను తొలగించాలని చైనా సైనికులను కోరాయి. దీంతో రాళ్లు, ముళ్లకర్రలు, ఇనుపరాడ్లతో భారత సైనికులపై చైనా సైనికులు ఏకపక్షంగా దాడిచేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ ఘర్షణల్లో ఇరవై మంది భారత సైనికులు మంది అమరులయ్యారు. చైనా సైనికులు కూడా పెద్దసంఖ్యలోనే మరణించారు. అమెరికా నిఘా వర్గాలు వెల్లడించిన ఓ నివేదికలో 35మంది చైనా సైనికులు మృతి చెందారని పేర్కొన్నాయి.
గల్వాన్ ఘర్షణల్లో అమరులైన భారత వీర సైనికులకు భారత జాతి మొత్తం నివాళులర్పించింది. కేంద్ర ప్రభుత్వం మరణాంతరం ఇచ్చే గ్యాలెంటరీ పురస్కారాలతో గౌరవించింది. అలాగే తూర్పు లద్దాఖ్ లోని పోస్టు 120 ప్రాంతంలో గ్యాలెంట్స్ ఆఫ్ గల్వాన్ పేరుతో ఇరవై మంది అమరులకు భారత సైన్యం స్మారకం కూడా నిర్మించింది. సైనిక వ్యవహారాల శాఖ కూడా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ లో అమరులైన 20 మంది సైనికుల పేర్లు నమోదు చేసింది.
అమరులైన ఇరవై మంది భారత సైనికుల త్యాగాలను భారత ప్రభుత్వం.. దేశ ప్రజలు ఇప్పటికి మననం చేసుకుంటూనే ఉన్నారు. కానీ కమ్యూనిస్టు చైనా మాత్రం.. గాల్వాన్ ఘర్షణలో మరణించిన తన దేశ సైనికుల వివరాలను ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు మరణించిన తమ దేశ సైనికుల వివరాలపై ఇప్పటికి డొంక తిరుగుడు ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. ఒకసారి ఒకరే మరణించారని, మరోకసారి నలుగురని, ఇంకొకరి సారి ఐదురుగు అంటూ మాట మారుస్తూ వస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న కొంతమంది చైనా విద్యార్థులు మాత్రం 44 మంది వరకు చైనా సైనికులు మరణించారని సోషల్ మీడియాలో పేర్కొన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
అయితే తాజాగా గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తాలుకు ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ హ్యాండిల్ @detresfa ట్విట్టర్‌లో ఈవీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫుటేజ్ ను పరిశీలిస్తే…ఇది గల్వాన్ ఘర్షణల్లో మరణించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన కొన్ని సైనిక కుటుంబాలను చైనా అధికారిక మీడియా ఇంటర్య్వూ చేసిన భాగంలోనిదిగా తెలుస్తోంది.
ఈ వీడియోని చాలా పకడ్బందిగా ఎడిట్ చేసిన తర్వాత ప్రసారం చేసినట్లుగా కనిపిస్తోంది. ఆ దృశ్యాల్లో PLA సైనికులు ఒక కొండపై నుంచి భారత దళాలపై రాళ్లు రువ్వడం కనిపిస్తుంది. అలాగే గల్వాన్ నది ఒడ్డున భారత మరియు చైనా సైనికులు ఒకరినొకరు నెట్టుకురావడం చూడవచ్చు. రాత్రి సమయంలో గల్వాన్ నది లోయలో ఒక చిన్న మలుపు వద్ద ఫ్లాస్ లైట్ల వెలుతూరులో చైనా సైనికులు, భారత సైనికులు ఒకరినొకరు తోసుకోవడం కనిపిస్తోంది. కొంతమంది సైనికులు నదిలో కొట్టుకుపోతుంటే వారిని మరికొందరు బయటకు లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి.
అయితే ఆల్ ఆఫ్ సడన్ గా.., డ్రాగన్ చైనా.., ఈ తాజా వీడియోను ఎందుకు లీక్ చేసింది.? దాదాపు ఏడాది తర్వాత… ఇప్పుడు తమ దేశ సైనిక కుటుంబాలను చైనా అధికారిక మీడియా ఎందుకు ఇంటర్వ్యూ చేసింది? ఈ ఇంటర్వ్యూ వెనుక అసలు మతలబేంటి? షి జింగ్ పింగ్ పై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని ఓ వర్గం అసంతృప్తితో ఉందా? చైనా మాజీ సైనికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నారా? తమ త్యాగాలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించడం లేదని పీఎల్ఏ మాజీ సైనికులు సైతం రగిలిపోతున్నారా? ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత్ … అమరులైన తన దేశ సైనికులకు ఇచ్చిన గౌరవ పురస్కారాలను చూసిన తర్వాత…తమ త్యాగాలకు చైనా కమ్యూనిస్టు పాలకులు కనీస విలువలు ఇవ్వడం లేదని పీఎల్ఏలోని ఓ వర్గం…, షి జింగ్ పింగ్ పై అసంతృప్తితో ఉన్నట్లు కూడా అప్పట్లోనే ది న్యూస్ వీక్ ఒక ఆసక్తికర కథనం ప్రచురించింది.
గల్వాన్‌ ఘర్షణలో అమరులైన జనాన్ల సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం…, వారికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. వారి త్యాగాన్ని యావత్తు దేశం కొనియాడింది. ప్రతి భారత పౌరుడు వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సైనిక కుటుంబసభ్యులకు అండగా నిలిచాయి.
కానీ…, చైనా మాత్రం.., ఇప్పటి వరకు తమ సైనికులు చనిపోయినట్లు కూడా అధికారికంగా అంగీకరించలేదు. భారత సైనికుల చేతుల్లో దాదాపు దాదాపు 44 మంది చైనా సైనికులు మృతి చెందారని ప్రకటించిన వెంటనే…, షీ జిన్ పింగ్ పై దేశంలో వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయని ఆ కథనం పేర్కొనడం జరిగింది.
నిజానికి చైనా సైన్యానికి అసలు యుద్ధ అనువభవం తక్కువ.! చివరి సారిగా 1979లో వియత్నాంతో చైనా నేరుగా సైనిక ఘర్షణకు దిగింది. ఆ యుద్ధంలో చైనా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాతే చైనా వ్యూహాం మర్చిందని, భారీ స్థాయిలో సైనిక, ఆయుధ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిందని.. అయినా, యుద్ధ క్షేత్రంలో వారి సామర్థ్యం తగిన స్థాయిలో లేదని గల్వాన్ ఘటనల్ని చూస్తే అర్థమవుతోందని ఆ కథనంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు గోర్డన్‌ జీ చాంగ్‌ అభిప్రయపడ్డారు.
అటు అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ మాజీ నేత కుమారుడైన జియాన్ లీ యాంగ్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం జరిగింది. చైనాలో దాదాపు 5.7కోట్ల మంది మాజీ సైనికులు ఉన్నారని.., వీరంతా చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. వీరంతా ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి త్యాగాలను గుర్తించడంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా, అలాగే ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని.., కనీసం ప్రజలకు సైతం వాస్తవ పరిస్థితులు ఏంటో కూడా వివరించడం లేదని వాపోతున్నారు. వియత్నాం యుద్ధం, కొరియా యుద్ధంలో పోరాడిన పీఎల్ఏ సైనికుల త్యాగాలను కూడా చైనా పాలకులు ఏ మాత్రం గౌరవించడంలేదని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వియత్నాం, కొరియా యుద్ధాల్లో పాల్గొన్న చైనా మాజీ సైనికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. పింఛన్లు ఇతరత్రా ప్రయోజనాలు కల్పించేందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఓ సరైన వ్యవస్థే లేదని తెలుస్తోంది. దీంతో వారంతా స్థానిక ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తోంది. నిధుల పరిమితుల దృష్ట్యా ఆ ప్రభుత్వాలు వారికి చాలా తక్కువ మొత్తంలో సాయం చేయగలుగుతున్నాయి.
దీంతో వృద్ధాప్యంలో బతుకు వెళ్లదీసేందుకూ నానా యాతన పడాల్సి వస్తోంది. వీరి పరిస్థితిని గమనిస్తున్న ప్రస్తుత సైనికులు… జిన్‌పింగ్‌ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జిన్‌పింగ్‌ ప్రభుత్వం మృతుల సంఖ్యను వెల్లడించడానికి భయపడుతోందని జియాన్‌లీ యాంగ్‌ తెలిపారు.
రోజు రోజుకు అటు గల్వాన్ మృతుల కుటుంబాల నుంచి, ఇటు మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత పెరిగిపోతుండటంతో…, షి జిన్ పింగ్ ప్రభుత్వం.. గల్వాన్ కుటుంబాలకు తాము అండగా ఉన్నట్లుగా నమ్మించడం కోసం, పోరాటం జరిగిన ఏడాది తర్వాత, కొంతమంది మృతుల కుటుంబాలతో ఫ్రీ ఫ్లాన్డుగా ఇంటర్వ్యూలు చేసి.., వాటిని ఎడిట్ చేసి.., తమకు అనుకులమైన అంశాలనే చైనా ప్రజలకు ప్రసారం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
సో.. చైనా అనగానే…అహా… ఓహో అంటూ మన దేశంలోని లెఫ్ట్ లుటియెన్స్ మీడియా చానళ్లు, చైనా తాబేదారులు ఇకనైనా బాకాలుదడం మానేస్తారని ఆశిద్దాం. భారత్ మాతాకీ జై.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

three × 1 =

Back to top button