More

    బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి కారణం ఇక్బాల్ హస్సేన్.. కావాలనే పక్కా ప్లాన్ తో చేశారు

    బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దుర్గా మాత పాదాల వద్ద ఖురాన్ ను ఉంచి.. దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పెద్ద ఎత్తున హిందువులపై అక్కడి ముస్లింలు దాడి చేశారు. ఆలయాలను ధ్వంసం చేశారు, హిందువుల ఇళ్లను తగులబెట్టారు. ఎంతో మంది అమాయక హిందువులు ప్రాణాలు కోల్పోయారు.

    దుర్గామాత పాదాల వద్ద ఖురాన్ గ్రంథాన్ని పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు ఇక్బాల్ హస్సేన్ అని తేలింది. సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన అనంతరం నిందితుడిని పోలీసులు గుర్తించి, కాక్స్ బజార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఇక్బాల్ హుస్సేన్ ను కుమిల్లాకు తరలించారు. దుర్గామాత పాదాల వద్ద ఖురాన్ ప్రతిని ఉంచిన ఇక్బాల్ అక్కడి హనుమంతుడి విగ్రహం వద్ద ఉన్న గదతో తిరిగి రావడం సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది.

    పోలీసు విచారణలో ఇక్బాల్ హస్సేన్ అనే ముస్లిం వ్యక్తి ఖురాన్ కాపీని బంగ్లాదేశ్‌లోని దుర్గా పూజా పండల్ వద్ద ఉద్దేశపూర్వకంగా ఉంచాడని తెలుసుకున్నారు. మరో కొత్త సీసీటీవీ ఫుటేజ్ లో స్థానిక దర్గాబరి మజార్ యొక్క సంరక్షకుడిని కలుసుకున్నట్లు చూపించింది. స్థానిక మసీదు నుండి ఖురాన్ కాపీని సేకరించినట్లు కూడా గుర్తించారు. చీఫ్ కస్టోడియన్ అహ్మదున్నబి మషుక్ తో పాటూ మసీదుకు చెందిన మరో ఇద్దరు కేర్ టేకర్లను హఫీజ్ హుమయూన్, ఫైసల్‌గా గుర్తించినట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. అక్టోబర్ 12 న రాత్రి 11 గంటలకు ఇక్బాల్ హస్సేన్ ని కలిసిన తరువాత.. కేర్‌టేకర్ హఫీజ్ హుమయూన్ ఖురాన్ కాపీని పక్కనే ఉన్న మసీదులోని ఒక గదిలో ఉంచాడు. ఇక్బాల్ హస్సేన్ అక్టోబర్ 13 రాత్రి మసీదు నుండి 2:12 గంటలకు ఖురాన్ ను సేకరించడం కనిపించింది.

    అక్టోబర్ 21 న జర్నలిస్ట్ పూజా మెహతా షేర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో ఖురాన్ కాపీతో ఇక్బాల్ మసీదును వదిలి వెళ్లినట్లు కనిపించింది. “సీసీటీవీ ఫుటేజ్‌లో ఇక్బాల్ హస్సేన్ ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్నారు. కొమిల్లాలోని దుర్గా పూజ మండపం వద్ద పవిత్ర ఖురాన్ ఉంచడం హింసకు దారితీసిందని బంగ్లాదేశ్ పోలీసులు చెప్పారు ” అని ట్వీట్ చేశారు.

    కొమిల్లాలోని సుజనగర్ ప్రాంతానికి చెందిన నూర్ అహ్మద్ ఆలం కుమారుడు 35 ఏళ్ల ఇక్బాల్ హస్సేన్ అక్టోబర్ 13 న కొమిల్లాలోని ననువా దిగిర్ పార్ వద్ద దుర్గా పూజ మండపం వద్ద ఖురాన్‌ను ఉంచాడు. ఆ తర్వాత వైరల్ అయిన ఫోటోలు, వీడియోల కారణంగా మైనారిటీ హిందువులపై వరుస హింసకు దారితీసింది. పూజా వేదిక వద్ద వీడియో ఫుటేజీలను విశ్లేషించిన తర్వాత పోలీసులు ఇక్బాల్‌ను గుర్తించారు. కొమిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఫరూక్ అహ్మద్‌కు సమాచారం అందించారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉందో లేదో తెలియదు. ఇక్బాల్ హుస్సేన్ మానసిక రోగి అని, డ్రగ్స్ కు బానిస అని కొన్ని బంగ్లాదేశ్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. హోంమంత్రి అసద్ ఉజ్జమాన్ దీనిపై స్పందిస్తూ, ఈ వ్యవహారం మొత్తం ఓ పథకం ప్రకారం జరిగినట్టుగా భావిస్తున్నామని తెలిపారు.

    Related Stories