More

    రవీంద్ర జడేజా ట్వీట్ తో ఉడికిపోతున్న లెఫ్ట్ లుటియెన్స్ గ్యాంగ్

    పడికట్టు పదాలు సృష్టించడం.., వాటిని బేస్ చేసుకుని, ప్రజలను రెచ్చగొట్టడం.! ఆ తర్వాత ఇతర వర్గాలపై దాడులు చేసేలా వారిని పోత్సహించడం.! కమ్యూనిజం అంటే ఇదేనా..?
    దున్నేవాడిదే భూమి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకేళ్ళు తప్ప..! ప్రపంచ కార్మకులారా ఏకండి..! ఉన్నవాడు..లేని వాడు..! haves and have nots..! పెట్టుబడిదారులంటే… దోపిడిదారులు, బూర్జువాలు..! ఈ నినాదాలు.. పదాలు అన్ని కూడా మన దేశంలో కమ్యూనిస్టులు సృష్టించనవే.!
    రాజ్యాధికారమనేది తుపాకి గొట్టం ద్వారా మాత్రమే వస్తుందని చాలా కాలం నమ్మారు ఈ కమ్యూనిస్టులు. నరహంతక మూకల బృందాలను ఏర్పాటు చేశారు. చాలా దేశాల్లో కమ్యూనిజం పేరుతో నరమేధం సృష్టించారు. మన దేశంలో కూడా ఈ కమ్యూనిస్టులు చీలిక పేలికలై అనేక గ్రూపులు కట్టారు. ఇంకా కూడా మావోయిస్టుల రూపంలో మన దేశంలో నరమేధం సృష్టిస్తూనే ఉన్నారు.
    మన సమాజంలో విభజన రేఖలు గీయడంలో ఈ లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్, తుక్డే తుక్డే గ్యాంగులను మించినవారుండరనేవారు లేకపోలేదు. యూనివర్శిటీలనే కేంద్రంగా చేసుకుని… కొంతమంది ప్రొఫెసర్లు మావోయిస్టు హింసావాదాన్ని పోత్సహించడమేకాకుండా.., దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ హింసాకాండను రెచ్చగొడుతున్న వార్తలు చూస్తున్నాం. అంతేకాదు విద్యార్థులను మావోయిస్టు సానుభూతిపరులుగా మార్చివేసి… వారిని నక్సల్స్ గా రిక్రూట్ చేయడం లాంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమందిని ఎన్ఐఏ అరెస్టు కూడా చేసింది.
    ఈ అర్బన్ నక్సల్స్…ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను సైతం ఉపయోగించుకుంటూ, సమాజంలో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా సాంస్కృతిక జాతీయవాదులను వీరు టార్గెట్ చేస్తున్నారు.
    మన భారత్ లో జన్మించిన ప్రతి ఒక్కరికి తనదైన సాంస్కృతిక వారసత్వం ఉంటుంది. మన దేశ సంస్కృతిక సంపద…, మనకు ఎలాగైతే గర్వకారణమో.., అలాగే దేశంలోని ప్రతి వ్యక్తి కూడా.., తన కుటుంబపరమైన తన సామాజిక సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వారసత్వంగా వాటిని తనదైన కుటుంబ ఐడెంటిటిగా ప్రతి వ్యక్తి భావిస్తాడు. దానిని నలుగురికి చెప్పుకునేందుకు వెనుకాడడు.!
    ప్రతి సామాజిక వర్గం సహజంగా చేసేదే! సోషల్ మీడియా యాక్టివిజం.., దేశంలో పెరిగిన తర్వాత, తమ ఈ ఐడెంటిటికి సంబంధించి.., ప్రతి విషయాన్ని ప్రజలందరూ గర్వంగా షేర్ చేసుకుంటున్నారు. గుడికి వెళ్లిన సందర్భంలో, అమ్మవారికి బోనం సమర్పించిన సమయంలో, చండి హోమం చేసినప్పుడు.., వాటి తాలుకు ఫోటోలను నలుగురితో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా సామాజిక పరంగా తమ ఐడెంటిటి గురించి గర్వంగా తెలియపర్చడం జరుగుతోంది.!
    సోషల్ మీడియా కారణంగా మన దేశంలో సామాజివర్గాలవారిగా ఏకీకరణ జరుగుతున్న మాట వాస్తవం. అదే సందర్భంలో వీరందరూ దేశ సంస్కృతికి, జాతీయవాదానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. తామను తాము ఈ దేశ సంస్కృతికి వారసత్వానికి ప్రతినిధులుగా ప్రకటించుకుంటున్నారు.
    అయితే… విదేశాల్లో పుట్టిన కమ్యూనిజానికి మన భారతీయత.., మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబొట్టు…, మన జాతీయత ఏం అర్థమవుతుంది చెప్పండి.! భారత్ లోని వివిధ ప్రాంతాలు మధ్య వైవిధ్యం, వివిధ భాషలు.., వివిధ సంస్కృతి సంప్రదాయలున్నా కూడా, హిందుత్వమనే మూల సూత్రంలో ఆ సేతు హిమాచం వరకు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ దేశం మనుగడ సాగిస్తుండటం.., ఈ కమ్యూనిస్టులకు అసలు అర్థం కాదు.! వారు మన దేశాన్ని అర్థం చేసుకోవడం పూర్తిగా విఫలం అయ్యారు కాబట్టే … రాజకీయంగా కనుమరుగయ్యారు.
    ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి..! కమ్యూనిస్టులు…, ఎవరినైనా టార్గెట్ చేశారనుకోండి..! మొదట తమ పడికట్టు పదాలతో.., వారిపై ఒక ముద్రవేసి.., వారిని బ్లేమ్ చేస్తారు. వారిని పూర్తిగా డిఫెన్స్ లో పడేస్తారు. దీంతో కమ్యూనిస్టులు టార్గెట్ చేసిన సదరు వ్యక్తి… , ఆ ముద్రను తొలగించుకోనేందుకు పదే పదే క్లారిటీ ఇస్తూనే ఉంటాడు. ఒక రకంగా వారు పూర్తిగా ఆత్మరక్షణలోకి వెళ్లిపోతాడు. కమ్యూనిస్టులు తమ ప్రత్యర్థులపై ఈ స్ట్రాటజీని అమలు చేస్తుంటారు. ఇందులో వామపక్ష మీడియా జర్నలిస్టులు తమ వంతు పాత్రను పోషిస్తుంటారు.
    ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నానంటే,.! గత వారం భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా తమిళనాడుకు వెళ్లాడు. నిజానికి అక్కడి వారే ఆయన్ను… తమిళనాడు క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో వ్యాఖ్యాతగా వ్యవహారించేందుకు ఆహ్వానించారు. క్రికెట్ కామెంట్రీలో భాగంగా ఘనమైన ప్రాచీన తమిళ సంస్కృతి,సంప్రదాయాలను ప్రస్తావిస్తారు. మాటల సందర్భంలో సురేశ్ రైనా తాను సైతం బ్రాహ్మణుడనేని తన సామాజిక వర్గం ఐడెంటిటిని బయటపెట్టారు. ఇలా సురేశ్ రైనా తాను బ్రాహ్మణుడని, తన కులం పేరు చెప్పాడని లెఫ్ లుటియెన్స్ గ్యాంగ్ అతన్ని తప్పుపట్టారు. సురేశ్ రైనా కులతత్వవాది అంటూ ముద్రవేసి, ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
    దీంతో సురేశ్ రైనా… ఈ లెఫ్ట్ లుటియెన్స్ గ్యాంగ్ ట్రోలింగ్ తో ఒకింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయాడు. నేను.. అలా కాదు,! అసలు నా ఉద్దేశం అదికాదు..,! నేను చెప్పిన సందర్భం.., సిచ్యూవేషన్ అర్థం చేసుకోండి..! అంటూ వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.అయితే రైనా చెప్పిన మాటలు వినకుండా, లెఫ్ట్ లుటియెన్స్ గ్యాంగ్ అతన్ని బద్నామ్ చేశాయి.
    అయితే ఈ సందర్భంలో…, సురేశ్ రైనాకు అతని మిత్రుడు ఆల్ రౌండర్.., రవీంద్ర జడేజా అండగా నిలిచాడు. దేశ వ్యతిరేక లెఫ్ట్ లుటియెన్స్, తుక్డే తుక్డే గ్యాంగులతో ఏలా ఆడాలో తనదైన స్టయిల్లో చూపించాడు రవీంద్ర జడేజా.!
    ఐ యామ్ రాజ్ పుత్ ..! రాజ్ పుత్ బాయ్ ఫరెవర్….! జై హింద్..! అంటూ తన ట్వీటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ధైర్యంగా ఆయన చేసిన ఈ ప్రకటనపై అనేకమంది నెటిజన్లు చాలా వ్యాఖ్యాలే చేశారు. కొంతమంది అతన్ని మెచ్చుకున్నారు. మరికొంతమంది అతన్ని మందలించే ప్రయత్నం కూడా చేశారు.
    అయితే…! ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే..! దేశ వ్యతిరేక లెఫ్ట్ లుటియెన్స్.., తుక్డే తుక్డే గ్యాంగులు చేసే ట్రోలింగ్ కు, ఏలాంటి కౌంటర్ ఇస్తే, వారు నోళ్లు మూసి దారికి వస్తారో.., రవీంద్ర జడేజా తన ట్వీటర్ కామెంట్ ద్వారా నిరూపించాడు.
    ఏది ఏమైనా…!
    శతాబ్దాల తరబడి, బానిసత్వంలో మ్రగ్గిన కారణాన, మనలో కొన్ని వికృతులు, ఉచ్ఛనీచ భావాలు, ఆర్థిక వైషమ్యాలు, వెనుకబడినతనం, కులతత్త్వం మొదలైనవి ప్రవేశించి ఉండవచ్చు.! కానీ.., వీటిని రెచ్చగొట్టి.., మన అస్తిత్వానికే భంగం కలిగించేందుకు, విదేశీయులు ఎవరైనా ప్రయత్నిస్తే.., వారిని మనం సహించేది లేదు.! వారి కుట్రలను మనం వమ్ముచేస్తాం.! ఇది మన గృహచ్ఛిద్రం! మన ఇంటి గొడవ..,! దీనిని మనలో మనమే సర్దుకోగలం.! సొంతలాభం కోసమో, సామాజికంగా క్రిందిస్థాయి నుంచి పైకి రావాలనే కోరికతోనో మనం విదేశీ తొత్తులం కాబోము.!
    మనలోనుండి బయలుదేరే జయచంద్రుల పట్ల మనం అప్రమత్తులమై ఉండాలి. ఈ జాతికి , ఈ సమాజానికి మనం అవయవ స్వరూపులం. మన సమాజానికి హితం కలుగజేసేదాన్నే మనం ఆచరించాలని చెప్పిన భారతరత్న డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ చెప్పిన మాటలను మనం నిత్యం మననం చేసుకోవాలి. మనసా వాచా కర్మాణా దేశ హితం కోసం పాటుపాడాలి.. జైహింద్!

    Related Stories