Sports

రజతంతో సరిపెట్టుకున్న రవి కుమార్ దహియా

రెజ్లింగ్ లో భారత్ గోల్డ్ సాధించలేకపోయింది. రవి కుమార్ దహియా ఫైనల్ లో 7-4 తేడాతో ఆర్.ఓ.సి.కి చెందిన ఉగుయేవ్చేతిలో ఓటమి పాలయ్యాడు. ఫైనల్ లో రవి కుమార్ కు ఉగుయేవ్చేతి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆట మొదలైనప్పటి నుండి రవి కుమార్ పై ఉగుయేవ్చేతి పట్టు సాధించాడు. ఆట ఆఖర్లో ఎలాగైనా పాయింట్లను సంపాదించాలని అనుకున్న రవి దహియాను ఉగుయేవ్చేతి అడ్డుకున్నాడు. ఆఖరి సెకండ్లలో కూడా రవి కుమార్ పాయింట్లు సాధించాలని చేసిన పోరాటం నిలబడలేకపోయింది. దీంతో రవి కుమార్ దహియా కాంస్యంతో భారత్ లో అడుగుపెట్టనున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి కుమార్ దహియా నిలిచాడు.

రవి కుమార్ దహియా పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఉగుయేవ్చేతి చేతిలో 4-7 తేడాతో ఓడిపోయి రజత పతకం సాధించాడు. సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన రెండో భారతీయ రెజ్లర్ అయ్యాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ అయిన ఉగుయేవ్చేతిని నిలువరించడానికి రవి కుమార్ ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ సమయంలోనైనా రష్యన్‌ను అధిగమించలేకపోయాడు. దీంతో రవి కుమార్ దహియా సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. అతడు సాధించిన ఈ ఘనతకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

10 + 15 =

Back to top button