More

    కేంద్రం పంపిన రేషన్ ను కుళ్లబెట్టిన కేజ్రీవాల్ సర్కార్

    కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో సొంత ఊళ్లకు వెళ్లలేకపోయిన ఎంతో మంది ఆకలితో అలమటించారు. చాలా వరకూ దాతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభాగ్యుల కడుపు నింపడానికి ప్రయత్నాలు చేశాయి. అయితే ఢిల్లీలో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

    ఒక గదిలో టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలు ఉపయోగించకుండా పడిపోయి చెడిపోయినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. రేషన్ సరుకులు ఇక వినియోగానికి అనర్హమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ రేషన్ బస్తాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోటో ముద్రించారు. ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థన్ పోస్టు చేశారు. వసంత కుంజ్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో వందలాది టన్నుల ఆహార ధాన్యాలు చెడిపోయాయని.. ఇతర పాఠశాలలు మరియు గోడౌన్లలో పిఎం గారిబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఉచిత రేషన్లను ఆప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా నిల్వ చేసిందని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రేషన్‌ను నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉండాలని.. అయితే దానిని అవసరమైన వారికి అందజేయకుండా.. ఆప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా హోర్డింగ్ చేసి, రేషన్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేస్తోందని ఆరోపించారు.

    దైనిక్ జాగరన్ మీడియా కథనాల ప్రకారం.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో నిల్వ చేసిన రేషన్ ఢిల్లీలో రేషన్ కార్డులు, ఢిల్లీలో నివాస పత్రాలు లేని ఇతర రాష్ట్రాల కార్మికుల కోసం ఇవ్వాలని సూచించారట. లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుండి వారి స్వగ్రామాలకు వెళ్లాలని యోచిస్తున్న వలస కార్మికులకు పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ ను గత సంవత్సరం పంపింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకోలేదు. రేషన్ నిల్వ చేసి ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయే దాకా తీసుకుని వచ్చింది.

    మే 31 న బీజేపీ నాయకులు రూబీ యాదవ్ కూడా ఆప్ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నాయకులు పాఠశాలలను సందర్శించారని, వందల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయని, అవి కుళ్ళిపోతున్నాయని రూబీ యాదవ్ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై వసంత కుంజ్ పోలీస్ స్టేషన్లో రూబీ యాదవ్ పోలీసు ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి ఈ రేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందని రూబీ యాదవ్ అన్నారు. రోజువారీ కూలీ కార్మికులు, వలస కార్మికులు, మురికివాడల్లో నివాసం ఉండే కుటుంబాలకు లాక్ డౌన్ సంక్షోభ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం రేషన్ పంపిణీ చేయలేదని తెలుస్తోంది.

    ఒక వైపు, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పంపిన రేషన్లను అక్రమంగా నిల్వ చేసి, వృధా చేసిన ఢిల్లీ ప్రభుత్వం. మరోవైపు ఢిల్లీలోని రేషన్ కార్డుదారులందరికీ రెండు నెలల కాలానికి “ఉచితంగా రేషన్” లభిస్తుందని ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండు నెలల పాటు ఉచిత రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు వారాల తరువాత ఈ ప్రకటనను కేజ్రీవాల్ ప్రభుత్వం చేసింది.

    Related Stories