More

    సంచలన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్

    తాలిబాన్లు అధికారం లోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ లో క్రీడల గురించి ఆందోళన మొదలైంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మగవాళ్ల క్రికెట్ కు తాలిబాన్లు మద్దతు ఇచ్చారు. తాము క్రికెట్ కు అండగా నిలుస్తామని చెప్పారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యూఏఈలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. రషీద్ ఖాన్ తన కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకున్నాడు.

    ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉంది. ప్రపంచ కప్ సమయం దగ్గరకు వస్తుండటంతో అన్ని దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ విషయంలోనే ఆ జట్టు టీ20 కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ అసహనానికి లోనయ్యాడు. ఈ మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్ అయిన తనను బోర్డు సభ్యులు సంప్రదించలేదని అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుండు తప్పుకుంటున్నానని తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆడటం తనకు ఎప్పుడు గర్వకాణమే అని ప్రకటించాడు. ఇక రషీద్ తప్పుకోవడంతో ఆ జట్టుకు ఆల్ రౌండర్ నబీ ని కెప్టెన్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. నబీ, రషీద్ ఖాన్ అద్భుతమైన క్రికెటర్లను ప్రపంచ దేశాలు ఇప్పటికే ఒప్పుకున్నాయి. ఇక టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం ఆఫ్ఘన్ జట్టుకు కాస్త లోటే..!

    Trending Stories

    Related Stories