More

    కాకినాడ సూర్యా రావుపేట బీచ్ వద్ద అరుదైన చేప

    కాకినాడ జిల్లాలో అరుదైన చేప బీచ్ లో కనిపించింది. కాకినాడ రూరల్ మండలం సూర్యా రావుపేట బీచ్ వద్ద అతిపెద్ద పెప్పర్ మెన్ అనే చేప కొట్టుకు వచ్చింది. దీని విలువ లక్షల్లో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో ఆటుపోట్లు ఉన్నప్పుడు, భారీగా వర్షాలు పడినప్పుడు వేటకు వెళ్లకుండా సముద్రం ఒడ్డునే ఉంటారు. అందుకు కారణం విలువైన మత్స్య సంపద కొట్టుకు వస్తూ ఉంటుంది. గతంలో ఎన్నో అరుదైన చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాజాగా పెప్పర్ మెన్ అనే పెద్ద చేప కొట్టుకు వచ్చింది. దీంతో మత్స్య శాఖ అధికారుల సహాయంతో దానిని బహిరంగ వేలం నిర్వహించారు. కాకినాడకు చెందిన ఒక వ్యాపారి దీనిని దక్కించుకున్నాడు. దాని విలువ చెప్పేందుకు అంగీకరించలేదు. లక్షల్లో పలికిందని మాత్రం చెవులు కొరుక్కుంటూ ఉన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories