More

    రణ్ వీర్ సింగ్.. రెండు గంటలు పోలీసు స్టేషన్ లోనే..!

    బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ నగ్న ఫోటో షూట్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే..! పోలీసుల ప్రశ్నలకు అతను జవాబులు ఇచ్చాడు. ఈ కేసు విషయంలో అవసరమైతే బాలీవుడ్ హీరోకు విచారణ అధికారి మరోసారి సమన్లు పంపుతారని పోలీసులు తెలిపారు. ఈ ఫొటో షూట్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మహిళలు. రణ్ వీర్ న్యూడ్ ఫొటో షూట్ మహిళల మనోభావాలను దెబ్బతీసేలా, అసభ్యతను ప్రేరేపించేలా ఉందని, అతనిపై చర్చలు తీసుకోవాలని చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాలీవుడ్ నటుడిపై ఐపీసీ సెక్షన్లు 292, 294 తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని 509, 67(ఎ) కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా అతడి వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. రణ్ వీర్ సోమవారం ఉదయం 7 గంటలకు చెంబూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దాదాపు రెండు గంటల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పోలీసుల నోటీసులు అందుకున్న తర్వాత రణ్ వీర్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.

    spot_img

    Trending Stories

    Related Stories