భారత్ ను ఏమీ చేయలేక పాకిస్థాన్ కూల్చేసిన కాళీమాత ఆలయం.. తిరిగి నిర్మించారు

0
726

ఇండో-పాక్ యుద్ధంలో భారత్ ను ఏమీ చేయలేక పాకిస్థాన్ సైన్యం పలు ఆలయాల మీద దాడులకు దిగిన సంగతి తెలిసిందే..! ఎన్నో ఆలయాలపై బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. అలా ఢాకాలోని కాళీమాత మందిరాన్ని పాకిస్తాన్ కూల్చేసింది. ఆ ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారు. బంగ్లాదేశ్ పర్యటనలో వున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

ఢాకాలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాన్ని 1971లో పాకిస్తానీ బలగాలు ధ్వంసం చేశాయి. తిరిగి నిర్మించబడిన ఈ మందిరం భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య “ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక” బంధాలను సూచిస్తుందని ఆయన ప్రకటించారు. నూతన రామ్నా కలిబారిని ప్రారంభించిన తర్వాత కోవింద్ మాట్లాడుతూ.. భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య బంధం భాష, సంస్కృతి, బంధుత్వాల ద్వారా గుర్తించబడిందని అన్నారు. “బంగ్లాదేశ్ ప్రజలు నిరంకుశత్వం నుండి విముక్తిని సాధించడానికి చేసిన అపారమైన త్యాగాలకు నేను నివాళులర్పిస్తున్నాను. భయంకరమైన అసమానతలకు వ్యతిరేకంగా పోరాడడంలోనూ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన మీ అలుపెరగని ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము” అని కోవింద్ చెప్పుకొచ్చారు. రామ్‌నా ఆలయం వద్ద రాష్ట్రపతి కోవింద్‌కు బంగ్లాదేశ్ మత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఫరీదుల్ హక్ ఖాన్ స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాన్ని, అతిథి గృహాన్ని, బావిని, ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించిన ఫలకం ఈ విభాగాల నిర్మాణాన్ని భారత ప్రభుత్వమే చేసిందని తెలిపింది.

విక్ట‌రీ డే సెల‌బ్రేష‌న్స్ కోసం బంగ్లాలో రామ్‌నాథ్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. 1971 యుద్ధం స‌మ‌యంలో పాకిస్థాన్ ఆర్మీ సుమారు 250 మంది హిందువుల‌ను అత్యంత కిరాతకంగా హ‌త‌మార్చింది. ఆ త‌ర్వాత ఈ ఆల‌యాన్ని నేల‌మ‌ట్టం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సెర్చ్‌లైట్‌లో భాగంగా హిందువుల‌ను చంపేశారు. 600 ఏళ్ల క్రితం నాటి ఆల‌యంపై 1971 మార్చి 27లో పాక్ ఆర్మీ కాల్పులు జ‌రిపింది. ఆ ఆల‌యంలో ఉన్న ప్ర‌ధాన పూజారిని కూడా హ‌త‌మార్చారు. 2017లో అప్ప‌టి విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఈ ఆల‌యాన్ని ప్రాంతాన్ని చూసొచ్చారు. ఆ త‌ర్వాత ఇక్క‌డ రామ్నా ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నులు వేగంగా జరగడం మొదలైంది.

రామ్నా కలిబారి మధ్యయుగ కాలంలో నిర్మించాటారు. పొడవైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. 1929లో ఆలయ సముదాయంలో ఆనందమయి భక్తుల కోసం అదనపు భవనాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఆధ్యాత్మిక సలహాదారుగా మారారు. యుద్ధం సమయంలో ఆలయం అసలు నిర్మాణం కోల్పోయింది. పునర్నిర్మించిన రామ్నా కలిబారి ప్రారంభోత్సవం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో విజయం సాధించిన 50వ వార్షికోత్సవంతో సమానంగా జరిగింది. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్వర్ణోత్సవాన్ని కూడా సూచిస్తుంది. ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి కోవింద్ పాల్గొని గురువారం ప్రసంగించారు.

Kovind inaugurates Dhaka's historic Kali Mandir destroyed by Pak Army in  1971 | Deccan Herald

బంగ్లాదేశ్ మాజీ సమాచార మంత్రి హసనుల్ హక్ ఇను మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త రామ్నా కలిబారి ఆలయం రోజువారీ నిర్వహణకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోందని అన్నారు. అంతే కాకుండా, ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం ఢాకేశ్వరి కాళీ ఆలయ పునరుద్ధరణ, నిర్వహణ కోసం 10 కోట్ల టాకాలకు పైగా అందించింది అని మంత్రి చెప్పారు.

ভারত সরকারের দ্বারা বাংলাদেশে পুনঃস্থাপিত হলো হিন্দু মন্দির, উদ্বোধন করলেন  রাষ্ট্রপতি | Khoborwala Tv