‘జై బీజేపీ’ అనేసిన రామ్ గోపాల్ వర్మ

0
788

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల అనుకోకుండా ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. భారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని, ఆ పేరు చాలా అరుదుగా ఉంటుందని అన్నారు. అందుకే, ఆ పేరు తెరపైకి రాగానే, ఆ పేరుతో ముడిపడిన అనేక అంశాలు జ్ఞప్తికి వచ్చాయని వర్మ వివరించారు. ఆ కోణంలోనే తన అభిప్రాయాలను వెల్లడించానని, అంతేతప్ప ఎవరి మనోభావాలను గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు

మరోసారి ద్రౌపది ముర్ము కేంద్రబిందువుగా ఇప్పుడు ట్విట్టర్ లో స్పందించారు. అత్యంత గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాబోతున్న అపురూపమైన తరుణంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధం గురించి మర్చిపోయి ఆమెను ఆరాధిస్తారని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు, కొత్త భారతదేశంలో మహాభారతం పునర్ లిఖించబడుతుందని, భారత్ ను చూసి ప్రపంచం గర్విస్తుందని వివరించారు. అంతేకాకుండా “జై బీజేపీ” అంటూ చెప్పుకొచ్చారు.