రామ్‌ చరణ్‌ సినిమాకు బ్రేకులు ఎందుకు పడ్డాయి?

0
802
రామ్‌ చరణ్‌ సినిమాకు బ్రేకులు ఎందుకు పడ్డాయి?
రామ్‌ చరణ్‌ సినిమాకు బ్రేకులు ఎందుకు పడ్డాయి?

ప్పుడు టాలీవుడ్ లో ఎవ్వరి నోటా విన్నా రామ్‌ చరణ్‌ సినిమా సంగతులే వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఇక ఉండదట.. రాదట… ఇక అంతే సంగతులని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమా సినిమా? అనేగా మీ డౌటు? అక్కడికే వద్దాం.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ RC16వ సినిమాగా చెప్పుకొచ్చిన ఈ చిత్రం ఆగిపోయినట్లు కొద్దిరోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లోనూ ఈ వార్త విశేషంగా చక్కర్లు కొడుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఈ సినిమాపై లేనిపోని వదంతులు పోస్టుల రూపంలో తెగ సందడి చేస్తున్నాయి. అయితే.. ఎట్టకేలకు ఈ విషయంపై పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా చిత్రవర్గాలు అధికారికంగా ఓ స్పష్టతను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ట్విటర్‌ వేదికగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం లేదని .. ఇది నిజంగా నిజం అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది! ”గౌతమ్‌ తిన్ననూరి- మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తుందనుకున్న సినిమా ఆగిపోయింది. త్వరలోనే రామ్‌ చరణ్‌ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తాం’’ అని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ టీమ్‌ స్వయంగా ట్వీట్‌ చేసింది. అయితే.. ఈ RC16 సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా చిత్రం చేస్తున్నవిషయం తెలిసిందే. . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అదీ సంగతీ!!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two − 1 =