National

కశ్మీర్ ఫైల్స్, కేజీఎఫ్-2.. బాలీవుడ్ ను బెంబేలెత్తించాయి: రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. ఇష్టమొచ్చిన సమయంలో తనకు నచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉంటాడు. బాలీవుడ్ సినిమాలు ఇటీవలి కాలంలో పెద్దగా రాణించకపోవడం, కలెక్షన్స్ దారుణంగా ఉండడంపై రామ్ గోపాల్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

తాజా ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలకు సంబంధించిన కొన్ని షాకింగ్ స్టేట్‌మెంట్‌లు చేసాడు. ది కశ్మీర్ ఫైల్స్, KGF చాప్టర్ 2 సినిమాల గురించి స్పందించాడు. బాలీవుడ్‌లో ఎవరికీ KGF చాప్టర్ 2 నచ్చలేదని చెప్పాడు. ఒక పెద్ద హిందీ దర్శకుడు కేజీఎఫ్-2 ను ఐదుసార్లు చూడటానికి ప్రయత్నించాడని, అయితే అరగంట కంటే ఎక్కువ సమయం చూడలేకపోయానని తనతో చెప్పాడని ఆర్జీవీ అన్నాడు. బాలీవుడ్ ను రెండు సినిమాలు బెంబేలెత్తించాయని.. ఒకటి KGF – చాప్టర్ 2 కాగా.. ఇంకొకటి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు. ఈ సినిమాలో బాలీవుడ్‌లో ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే ఎవరూ ఊహించని కలెక్షన్స్ చేసినప్పుడు, మీరు గందరగోళానికి గురవుతారు. ఏమి చేయాలో మీకు తెలియదు. అందుకే బాలీవుడ్ పెద్దలకు ఈ సినిమాలు నచ్చలేదు.

యష్ నటించిన ఈ సినిమా భారీగా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నప్పటికీ.. బాలీవుడ్‌లో ఎవరికీ నచ్చలేదని అన్నాడు. హాలీవుడ్‌లో ఒక లైన్ ఉంది, ‘మీరు కంటెంట్ గురించి వాదించవచ్చు.. కానీ మీరు సక్సెస్ తో వాదించలేరు’! అని అన్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా, విజయాన్ని మీరు విస్మరించలేరని అన్నారు. ఇక ది కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని, ఒక తెలియని దర్శకుడు దీనిని రూపొందించాడని తెలిపాడు. ఈ చిత్రం ఇప్పటివరకు తీసిన వాటిలో అత్యంత నెమ్మదిగా ఉందని, డైరెక్టర్స్ ఏమి చేయకూడదో నేర్చుకున్న ప్రతిదానికీ ఈ సినిమా విరుద్ధంగా ఉందని వర్మ అన్నాడు. “స్క్రీన్‌ప్లే లేదు, ఫస్ట్ లేదా సెకండ్ యాక్ట్ లేదు, ఇంటర్వెల్ లేదు, క్లైమాక్స్ లేదు. ప్రజలు సినిమాను చూడడానికి విపరీతంగా వెళ్ళారు!” అన్నారాయన.

Related Articles

Back to top button