రామ్‌గోపాల్‌వర్మ పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ కంప్లయింట్ ఇచ్చారు. తన ‘డేంజరస్’ సినిమా రిలీజ్ టైమ్‌లో తనను డిస్టర్బ్ చేసిన నట్టి బ్యాచ్‌పై న్యాయపోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 50 లక్షల రూపాయలు ఇస్తానని తాను హామీ పత్రం ఇచ్చినట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని ఆయన ఆరోపించారు.ఆ సంతకం నాది కాదు.. ఆ అడ్రస్ నాది కాదు.. అన్నీ ఫేకే అంటూ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
‘ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో ‘మా ఇష్టం’) చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఈ ఫోర్జరీ కేసుకు సంబంధించిన వివరాల గురించి.. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో వారిపై రిటన్ కంప్లైంట్ ఇచ్చాను’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.