ఈ మధ్య వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన ఓ పోస్టుపైనా బాగా చర్చ జరిగింది. మన దేశాన్ని బ్రిటీష్ వాళ్లు ఎలా ఆక్రమించారనేది ప్రశ్న? నిజానికి బ్రిటీష్ వాళ్లు వర్తకం పేరుతో మన దేశానికి వచ్చినప్పుడు వారి వద్ద సైన్యం లేదు? ఆ తర్వాత కూడా బ్రిటన్ నుంచి పెద్దగా వారి సొంత సైన్యం వచ్చింది లేదు.!
మరి వారి చేతుల్లో మన భారత దేశం ఎలా బానిస దేశంగా మారిందో తెలుసా? బ్రిటీష్ వారికి… మనదేశాన్ని బానిస దేశంగా చేయడంలో కీలక పాత్ర పోషించింది కూడా మన భారతీయులేననే విషయం మనం మర్చిపోరాదు.! ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేసిన సైన్యంలో సైనికులుగా చేరి మన స్వదేశీ రాజులను ఓడించి మన దేశాన్ని వారు ఆక్రమించుకునేలా చేసింది కూడా మన భారతీయులే.!
అయితే ఆ పోస్టు చూసిన తర్వాత.., అప్పటికి ఇప్పటికి కూడా మన దేశంలో జయచంద్రులకు, మీర్ జాఫర్లకు కొదవలేదనిపిస్తోంది. ఏ మాత్రం జాతీయ స్వాభిమానం లేని లూటియెన్స్ జర్నలిస్టుల రూపంలో, వేర్పాటువాదాన్ని, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే తెలుగు మీడియా, పత్రికల రూపంలో, భారత దేశాన్ని ఎప్పుడు చులకన చేసి మాట్లాడే కమ్యూనిస్టులు, కుహానా మేధావుల రూపంలో, విదేశీ వర్శిటీలు ఇచ్చే ఫెలోషిప్పుల కోసం వెంపర్లాడూ… కట్టుకథలతో అర్థం పర్థం లేని వాదాలను, తెరపైకి తీసుకువచ్చే ప్రొఫెసర్ల రూపంలో, విదేశీ మిషనరీల రూపంలో, సోకాల్డ్ ఎన్జీవో సంఘాల కార్యకర్తల రూపంలో, ఇంకా ఖలీస్తాన్ వేర్పాటువాదుల రూపంలో, తుక్డే తుక్డే గ్యాంగుల రూపంలో, దేశ విచ్చిన్నకర శక్తులు ఇంకా సజీవంగా ఉన్నారని మనకు అనిపించకమానదు.ఎందుకంటే గ్రేటాథన్ బెర్గ్ టూల్ కిట్ లింకులు బయట పడిన తర్వాత జరిగిన అరెస్టులను వ్యతిరేకిస్తూ…ఆ కుట్రల భాగస్వాములైన వారిని ఈ మూకలు ఎంత నిర్లజ్జగా సమర్థించాయో దేశ ప్రజలు అందరూ చూశారు.
ఏకంగా బ్రిటన్ పార్లమెంటు భవనంలో ఆ దేశానికి చెందిన కొంతమంది ఎంపీలు మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా బరితెగించి చర్చ జరిపే సాహసం చేశారు. ఇంకా మన దేశంలో మీడియాకు అసలు స్వేచ్చ లేదని కూడా కారుకూతలు కూశారు. ఇంకా భారత్ లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది తన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బ్రిటన్ ఆఫీసు ఖాతాల నుంచి భారత్ లోని ఆమ్నెస్టీ సంస్థల ఖాతాల్లోకి భారీ మొత్తంలో విదేశీ నిధులు ప్రవాహం జరిగినట్లుగా గుర్తించిన భారత ప్రభుత్వం…వాటికి సంబంధించిన వివరాలను ఆమ్నెస్టి నుంచి కోరింది. అయితే ఆమ్నెస్టి ఇంటర్నేషన్ ఇండియా శాఖ విదేశీ నిధులకు సంబంధించిన లెక్కలను చూపించకపోవడంతో భారత్ లోని ఆమ్నెస్టి బ్యాంకు ఖాతాలను ఈడీ సీజ్ చేసింది. దీనిపై కూడా బ్రిటన్ ఎంపీలు అర్థంపర్థంలేని ఆరోపణలు చేశారు. వ్యక్తం చేశారు. త్వరలోనే ఇండియా టూర్ కు వెళ్తున్నరని.. ఈ విషయాన్ని ఇండియా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లేలా తమ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ పై ఒత్తిడి తీసుకువస్తామని కూడా బ్రిటన్ ఎంపీలు చెబుతున్నారు.
మరోవైపు బ్రిటన్ పార్లమెంటులో జరిగిన ఈ డిబేట్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తప్పుడు వాదనలతో నిజాలు తెలుసుకోకుండా.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పై నిందలు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని లండన్ లో భారత హై కమిషన్ ఆ చర్చ జరిగిన రోజునే ప్రకటనను విడుదల చేసి బ్రిటన్ ఎంపీల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. బ్రిటన్ తోపాటు, యూరోప్ దేశాలకు చెందిన మీడియా సంస్థలు భారత్ లో ఉన్నాయని, అవన్ని కూడా రైతుల ఆందోళనలపై.., కల్పిత కథనాలను ప్రసారం చేస్తున్నా… భారత ప్రభుత్వం వాటిని అడ్డుకోలేదనే విషయాన్ని గుర్తించాలని ఆ ప్రకటనలో బ్రిటన్ ఎంపీల చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది.
భారత అంతర్గత విషయాలపై చర్చించి భారత దేశ ఔనత్యాన్ని, గౌరవాన్ని, ప్రతిష్ఠాను దెబ్బతీసే ప్రయత్నం చేసిన బ్రిటన్ ఎంపీలకు తిరిగి అంతేస్థాయిలో భారత పార్లమెంటు సభ్యులు కూడా దీటుగా బుద్ది చెప్పారు. బ్రిటన్ ఎంపీలు పార్లమెంటు భవనంలో అనాధికార చర్చ జరిపితే… భారత ఎంపీలు ఏకంగా రాజ్యసభలోనే బ్రిటన్ లో పెరిగిపోతున్న జాతివిక్ష అంశాన్ని ప్రశ్నించి.. మా అంతర్గత విషయాలపై మీరు చర్చిస్తే… మీ దేశ అంతర్గత విషయాలను మేము కూడా చర్చించగలని ఆ దేశానికి గట్టి సందేశమే ఇచ్చారు.
బ్రిటన్ లో రోజురోజుకు పెరిగిపోతున్న జాతి వివక్ష అంశాన్ని బీజేపీ ఎంపీ అశ్వీని వైష్ణవ్ రాజ్యసభలో ప్రస్తావించారు. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్ విజయం సాధించింది. ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇదే తొలిసారి. అయితే రేసిజం, ట్రాన్సోఫోబియా కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సమంత్ ప్రకటించింది. ఆమె ఎన్నికపై భయాందోళనలు వ్యక్తం చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో చేసిన కామెంట్ల మూలంగానే ఆమె ఆ పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ వ్యహారంపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్… త్వరలోనే భారత్ కు రాబోతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో ఈ విషయాలను ప్రస్తావిస్తామని సభలో సభ్యులకు హామీ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని ఏప్రిల్ చివరి వారంలో భారత్ కు రానున్నారు.
అంతేకాదు బ్రిటన్ లో జాతి వివక్ష సామాన్య ప్రజల విషయంలోనే కాదు., బ్రిటన్ రాచకుటంబంలో సైతం ఉందనే వార్తలు మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో తాను జాతి వివక్షని ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలు అనుభవించానని, ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆఫ్రికన్ అమెరికన్ నటి… ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ ఓ ఇంటర్వ్యూ లో చేసిన ప్రకటన బ్రిటన్ జాతి వివక్ష బండారాన్ని బయటపెట్టింది.
స్వయంగా బ్రిటన్ రాచకుంటుంబంలోనే ఇంతలా జాతివివక్షత కొనసాగుతూ ఉంటే.., ఆ దేశానికి చెందిన బ్రిటన్ ఎంపీలు.. మన దేశంలో స్వేచ్ఛ, సమనత్వం లేదంటూ సుద్దూలు చెప్పడం…., దానికి మన దేశంలోని వారి తాబేదార్లు కొందరూ తందాన అనడం మనం చూశాం..! రైతుల పేరుతో కొంతమంది చేస్తున్న ఆందోళన పై, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగిందంటూ హెడ్డింగులు పెట్టారు. కానీ… అదే సమయంలో బ్రిటన్ ఎంపీలకు ఎంత ధైర్యం ? మా దేశ అంతర్గత విషయాలపై మీరు చర్చించడమేంటని ఒక్కడు అంటే ఒక్కడూ ప్రశ్నించలేదు. ఇక మన తెలుగు మీడియా చానళ్లు, ఇంకా మీడియా మొగల్ గా చెప్పుకునే పేపర్, దాని చానల్, అలాగే చంద్రజ్యోతిగా మారిన మరో పేపర్, దాని చానల్ గురించి, ఎంత తక్కువ మాట్లాడుకుంటే, అంతా మంచింది.! వీటికి దేశ హితం కంటే కూడా, ఒక కుటుంబ పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, తెలుగు ప్రజల్లో ప్రాంతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడమే వీటికి అవసరమా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లే ఆ పత్రికల నైజం ఏంటో చెబుతున్నాయి. బ్రిటన్ ఎంపీలు.. భారత్ వ్యతిరేకంగా పార్లమెంటు భవనంలో చర్చ జరిపినా, సరిగ్గా వారం రోజుల్లోనే మన ఎంపీలు కూడా గట్టిగానే బుద్ది చెప్పిన వార్తకు సంబంధించిన విషయాన్ని అటు నేషనల్ మీడియాతోపాటు ఇటు తెలుగు మీడియా కనీసం పట్టించుకోలేదు.
ఏ… 1947 కా భారత్ నహీ హై..! ఏ నయా భారత్ హై…! దుష్మన్ కే ఘర్ మే గుస్సుకే మరేగా…! ఈ విషయాన్ని బ్రిటన్ ఎంపీలు ఎంత త్వరగా గుర్తిస్తే అంతా మంచిది.