More

    పాక్ కొత్త ప్రధానికి రాజ్ నాథ్ సింగ్ చెబుతోంది ఇదే..!

    అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు” అని రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ 23వ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, సుస్థిరతను భారత్ కోరుకుంటోందని, ఇరు దేశాలు తమ అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించగలవని ప్రధాని మోదీ అన్నారు. “పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు హెచ్.ఇ. మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని భారతదేశం కోరుకుంటుంది ’ అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. సోమవారం నాడు PML-N అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు, అతనికి అనుకూలంగా 174 మంది శాసనసభ్యులు ఓటు వేశారు.

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే..! యుఎస్-ఇండియా 2+2 మంత్రివర్గ సమావేశం సందర్భంగా, భారతదేశ విధానాలకు అమెరికా సానుకూలంగా స్పందించిందని రాజ్ నాథ్ సింగ్ వార్తా సంస్థ ANIకి తెలిపారు. “భారత్‌లో కో-డెవలప్మెంట్, కో-ప్రొడక్షన్ విషయంలో అమెరికా కంపెనీలకు స్వాగతం పలుకుతున్నామని” ఆయన అన్నారు.

    రష్యా విడిభాగాలపై భారతదేశం ఆధారపడటం, రష్యా-ఉక్రేనియన్ వివాదం కారణంగా భవిష్యత్తులో భారతదేశం ఎదుర్కొనే సమస్యలపై మాట్లాడుతూ.. “భారతదేశం అన్ని రకాల సమస్యలు, సవాళ్లను సముచితంగా ఎదుర్కోగలదు” అని అన్నారు. అమెరికా-భారత్ 2+2 సమావేశంలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య సోమవారం వాషింగ్టన్‌లో చర్చ జరిగింది.

    Trending Stories

    Related Stories