Defence Special

ర‌క్ష‌ణ మంత్రి ఉన్న విమానం హైవేపై ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌.. ఈ ల్యాండింగ్ ఎంతో స్పెషల్..!

భారత వైమానిక దళం (IAF) విమానాల కోసం గురువారం జాతీయ రహదారి 925 లో సత్తా-గాంధవ్ స్ట్రెచ్‌లో అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ మరియు నితిన్ గడ్కరీ ప్రారంభించారు. సీ-130జే సూప‌ర్ హెర్క్యుల‌స్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్కేఎస్ బ‌దౌరియా ప్రయాణించారు. రాజ‌స్థాన్‌లోని జాలోర్‌లో ఉన్న నేష‌న‌ల్ హైవేపై ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్‌ ప్రాంతంలో విమానం ల్యాండ్ అయింది. ఇది ఆ ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రారంభోత్స‌వంలో భాగంగా జ‌రిగిన ల్యాండింగ్‌ అని అధికారులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ ముగ్గురితోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ కూడా పాల్గొన్నారు. ఇది రక్షణ పరంగా భారత్ కు ఎంతో స్పెషల్ ల్యాండింగ్ అని అధికారులు తెలిపారు.

IAF విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ఉపయోగించబడనున్న భారతదేశపు మొదటి జాతీయ రహదారిగా NH-925 నిలిచింది. గురువారం నాడు NH-925 యొక్క అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం పై మరికొన్ని విమానాల కార్యకలాపాలను మంత్రులు దగ్గర ఉండి చూశారు. “ప్రదర్శన సమయంలో ల్యాండ్ అయిన మొదటి విమానం C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం అని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మరియు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా దాని లోపల ఉన్నారు” అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

సుఖోయ్ -30ఎంకేఐ ఫైటర్ జెట్ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి చూపించింది భారత వైమానిక దళం. భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన సైనిక రవాణా విమానం, Mi-17v5 హెలికాప్టర్ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ దగ్గర ల్యాండ్ అవ్వడం విశేషం.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) భారత ఎయిర్ ఫోర్స్ కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం NH-925 లోని సత్తా-గాంధవ్ స్ట్రెచ్‌లోని 3-కిమీ విభాగాన్ని అభివృద్ధి చేసింది. అక్టోబర్ 2017 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్‌లు మరియు రవాణా విమానాలు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మాక్ ల్యాండింగ్‌లు నిర్వహించాయి. అలాంటి హైవేలను అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఉపయోగించవచ్చని చూపించాయి. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ఇది జాతీయ రహదారి కాదు.. ఇది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. మొత్తం 27 హైవేలను ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని.. వాటిపై అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్‌లను అభివృద్ధి చేయవచ్చో లేదో చూడటానికి అధికారులు పరిశీలన చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 12 =

Back to top button