National

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం..!

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చాలంటూ ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్స్ వస్తున్న సంగతి తెలిసిందే..! దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. హాకీకి వన్నె తెచ్చిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును చేర్చామని ప్రధాని వెల్లడించారు. క్రీడల్లో అత్యున్నత అవార్డును ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టాల్సిందిగా తనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని.. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యావాదాలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టామన్నారు. దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని ఆయన కొనియాడారు.

రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రారంభించారు. హాకీ క్రీడలో లెజెండ్ గా పేరు తీసుకున్న ధ్యాన్ చంద్ పేరును పెట్టారు. మూడు వరుస ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ నేతృత్వంలోని హాకీ బృందం స్వర్ణ పతకాలను సాధించింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజైన ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకం తృటిలో కోల్పోయిన రోజే ప్రధాని అవార్డు పేరు మార్చడాన్ని ప్రకటించారు. ఒక రోజు ముందు భారత పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒలింపిక్ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం పోరులో ఓడిపోయిన భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఓటమి చెందినందుకు బాధపడకండి.. అద్భుతమైన ప్రదర్శనను చేశారని ఆయన కితాబిచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌ హాకీ కాంస్య పతక పోరులో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓడిపోయారు. హాకీలో భారత్‌కు మరో పతకం వస్తుందని ఎదురుచూసిన అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. రెండో క్వార్టర్‌లో భారత జట్టే ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరల్లో బ్రిటన్ వరుస గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. భారత హాకీ జట్టుకు చెందిన అమ్మాయిలు ఏడుస్తూ మైదానంలో కుప్పకూలిపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − sixteen =

Back to top button