More

    విడుదలైన నళిని శ్రీహరన్

    రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదలయ్యారు. 31 ఏళ్ల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వేలూరు జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో మొత్తం ఆరుగురు దోషులను నవంబర్ 11 శుక్రవారం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదలకు ముందు తమిళనాడులోని వెల్లూరు పోలీసులు సాధారణ ప్రక్రియను చేపట్టారు. జైలు నుండి విడుదలకు ముందు, పెరోల్ షరతులతో కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి నళిని వేలూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ప్రక్రియ పూర్తి చేయడంతో విడుదల చేశారు.

    రాజీవ్ గాంధీ హత్య సమయంలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాల పట్ల నళిని విచారం వ్యక్తం చేసింది. “నేను వారి కోసం చాలా చింతిస్తున్నాను. మేము ఆలోచిస్తూ చాలా సంవత్సరాలు గడిపాము.. మమ్మల్ని క్షమించండని” నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. ఎంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. వారు ఆ విషాదం నుండి బయటపడతారని నేను ఆశిస్తున్నానని.. 31 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన కొన్ని గంటల తర్వాత నళిని శ్రీహరన్ ఈ వ్యాఖ్యలు చేసింది.

    Trending Stories

    Related Stories