More

    రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు విడుదల చేసింది. పెరారివాలన్‌కు నిర్దేశించిన ప్రమాణాలు మిగిలిన దోషుల విషయంలో కూడా రూపొందించబడిందని అన్నారు. మిగిలిన జీవిత ఖైదీలకు AG పెరరివాలన్‌ను విడుదల చేస్తూ చెప్పినట్లుగా.. మే 18 2022న ఇచ్చిన తీర్పును కోర్టు వర్తింపజేసింది.

    2022 మే 18న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానం మిగిలిన దోషుల విషయంలో కూడా సరైనదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. వీరంతా జైలులో మంచి ప్రవర్తనతో ఉన్నారని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది.

    ఈ ఏడాది ప్రారంభంలో, ఏజీ పెరారివాలన్‌ 31 ఏళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు ముగించింది. జైలులో అతని సత్ప్రవర్తన, వైద్య పరిస్థితి, జైలులో సంపాదించిన విద్యార్హతలు, డిసెంబర్ 2015 నుండి అతని క్షమాభిక్ష కు సంబంధించిన పిటిషన్ పై సుదీర్ఘ పెండింగ్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఆర్టికల్ 161 కింద పెరారివాలన్ డిసెంబర్ 2015 నుండి తమిళనాడు గవర్నర్ ముందు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో… ఆర్టికల్ 142 ప్రకారం అధికారాలను ఉపయోగించి, మేము పిటిషనర్‌ను విడుదల చేయవలసిందిగా ఆదేశించామని కోర్టు అప్పట్లో చెప్పింది. ఈ దోషులను జైలు నుంచి విడుదల చేయాలని 2018 సెప్టెంబరు 9న తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిందని, తమకు శిక్ష తగ్గించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు దోషులు విజ్ఞప్తి చేశారని సుప్రీంకోర్టు తాజాగా గుర్తించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు నుండి విముక్తి లభించనుంది.

    Trending Stories

    Related Stories