More

    జైలర్ మూవీ రివ్యూ

    నటీనటులు: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, రమ్య కృష్ణ, తమన్నా భాటియా, యోగి బాబు
    దర్శకుడు: నెల్సన్ దిలీప్‌కుమార్
    నిర్మాతలు: కళానిధి మారన్
    సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం, టెక్నికల్ వ్యాల్యూస్.. ఇలా చాలా అంశాలు సినిమా మీద అందరి దృష్టి ఉండేలా చూశారు. సినిమా అంచనాలకు అందుకుందా లేదా అనేది పరిశీలిద్దాం.

    కథ:

    “జైలర్” రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రిటైర్డ్ అయ్యాక తన కుటుంబంతో ఆయన ఎంతో ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. అతని కొడుకు అర్జున్ (వసంత్ రవి) అంకితభావం ఉన్న పోలీసు అధికారి, అతను పురాతన వస్తువుల స్మగ్లర్ అయిన వర్మ (వినాయకన్)కి అడ్డుగా నిలబడతాడు. ఈ సమయంలో అర్జున్ కనిపించకుండా పోతాడు. అతడు కనిపించకుండా పోలేదని చంపేశారని ఆ కుటుంబానికి తెలుస్తుంది. అప్పుడు ముత్తు ఏమి చేశాడు. ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ

    పాజిటివ్ అంశాలు:

    రజనీకాంత్ పాత్ర ప్రత్యేకం. తలైవాను దర్శకుడు బాగా చూపించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా సాగుతుంది. ముఖ్యంగా సినిమా మొదటి సగంలో, రజనీకాంత్- యోగి బాబు కాంబో చాలా బాగా నవ్విస్తుంది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్ళింది మాత్రం అనిరుధ్ నేపథ్య సంగీతమే..! ఇంటర్వెల్ ఒక హైలైట్, రజనీకాంత్ వేరియేషన్స్ చాలా బాగుంటుంది. స్టార్ హీరోల కేమియోలు మాత్రం సినిమాకు కావాల్సిన ఊపును ఇస్తాయి.

    నెగటివ్:

    కథ ప్లాట్ చాలా బలహీనంగా అనిపిస్తుంది. మంచి ఫస్ట్ హాఫ్..ను సెకండాఫ్ ఇంకో ఎత్తుకు తీసుకుని వెళుతుందని అనిపిస్తుంది. కానీ ఆ ఊపు ఎక్కడో కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. సునీల్ పాత్ర, తమన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం కూడా తెలుగు ఆడియన్స్ కు నిరాశను ఇస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు ఇంకా ఎక్కువగానే ఊహించి వెళ్లి ఉంటాం. భావోద్వేగాలు మరీ ఎక్కువగా సెట్ అవ్వకపోవడం కూడా కాస్త మైనస్. సినిమా నిడివి, డ్రాగ్డ్ సీక్వెన్స్‌లతో సెకండ్ హాఫ్‌ కాస్త రొటీన్ గా అనిపిస్తుంది.

    ఓవరాల్ గా నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్ ను చాలా బాగా చూపించగలిగాడు కానీ.. స్క్రిప్ట్‌ లో అనుకున్నంత సత్తా లేకపోవడంతో సినిమా భారీ ఇంపాక్ట్ ఇవ్వదు. అక్కడక్కడ నవ్వులతో, డార్క్ హ్యూమర్ ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఆఖరి 20 నిమిషాలు స్పెషల్ అప్పియరెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, తలైవా మార్క్ డైలాగ్స్ కాస్త సంతృప్తిని ఇస్తాయి.

    Related Stories