చెన్నైలోని తన ఇంటి లాకర్‌లో బంగారం, వజ్రాభరణాలు మాయమైనట్లు రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విలువైన వస్తువులను 2019లో తన సోదరి సౌందర్య పెళ్లికి వినియోగించింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆ విలువైన వస్తువులేవీ కనపడలేదని అంటున్నారు. ఎప్పటినుంచో ఐశ్వర్య ఆభరణాలను లాకర్‌లో ఉంచుతోంది. ఆమె ఇంటి పనివాళ్లలో కొంతమందికి మాత్రమే ఆ విషయం గురించి తెలుసు. ఐతే దీనిపై తేనంపేట పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తన ఇంట్లోని ముగ్గురు సిబ్బంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు. గల్లంతైన విలువైన వస్తువులలో డైమండ్ సెట్లు, అన్ కట్ డైమండ్స్, పురాతన బంగారు, నవరత్నం సెట్లు, పురాతనమైన బంగారంతో కూడిన అన్ కట్ డైమండ్, ఆరామ్ నెక్లెస్, బంగారు గాజులు ఉన్నాయి. 2019లో తన చెల్లెలు పెళ్లికి నగలను ఉపయోగించిన తర్వాత ఆ నగలను తన లాకర్‌లో పెట్టుకుందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన ఫిబ్రవరి 10న వెలుగులోకి వచ్చింది. పెళ్లయినప్పటి నుంచి లాకర్‌ను మూడు చోట్లకు మార్చారు. ఆగస్ట్ 2021 వరకు ఆమె సెయింట్ మేరీస్ రోడ్ అపార్ట్‌మెంట్‌లో ఉంది. వివాహం తర్వాత ఆమె నటుడు ధనుష్‌తో నివసించిన సిఐటి కాలనీలోని ఆమె నివాసానికి మార్చారు. సెప్టెంబర్ 2021లో లాకర్ ను మళ్లీ సెయింట్ మేరీస్ రోడ్ అపార్ట్‌మెంట్‌కు తరలించారు. ఏప్రిల్ 9, 2022న, నటుడు రజనీకాంత్ పోయెస్ గార్డెన్ నివాసానికి తీసుకెళ్లారు. లాకర్ కీలను సెయింట్ మేరీస్ రోడ్ అపార్ట్‌మెంట్‌లోని తన అల్మారాలో ఉంచారని, ఈ విషయం సిబ్బందికి బాగా తెలుసునని ఆమె అన్నారు. తాను దూరంగా ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అధికారులు ఈ దొంగతనంపై విచారణ జరుపుతున్నారు.