National

పాలిటిక్స్ లోకి రావట్లేదని తేల్చేసిన రజనీకాంత్

రజనీకాంత్.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూసింది. ఈ ఏడాది జనవరిలో రజనీకాంత్ తాను పార్టీ పెట్టబోతూ ఉన్నానని గత ఏడాది డిసెంబర్ లో చెప్పారు. కానీ అనారోగ్య కారణాల వలన పార్టీ పెట్టడం లేదని తేల్చి చెప్పారు. కానీ సోమవారం నాడు మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో సమావేశం అవుతున్నారనే వార్త రావడంతో ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నదానిపై చర్చిస్తానని వార్తలు వచ్చాయి. ఇప్పటికే రజనీకాంత్ ని పాలిటిక్స్ లోకి రావాలని చాలామంది అడిగిన నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది .

అయితే ఈ సమావేశం అనంతరం రజనీకాంత్ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని.. రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. రాజకీయ పార్టీగా చెప్తున్న రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం అభిమానులతో భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. రజనీ మక్కల్‌ మండ్రంను ఫ్యాన్స్‌ క్లబ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. తన ఆరోగ్య కారణాలతో పలుమార్లు రజనీ రాజకీయ అరంగేట్రం వాయిదా వేస్తూ వచ్చారు. సోమవారం ఉదయం తన అభిమాన సంఘాలతో భేటీ సందర్భంగా రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనే అంశంపై చర్చించారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాకూడదని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారు. తన అభిమాన సంఘాలకు క్లారిటీ ఇచ్చిన అనంతరం మీడియా ముందుకొచ్చారు. భవిష్యత్తులోనూ తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు.

అనారోగ్యం రీత్యా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. మరోసారి చర్చల నేపథ్యంలో ఊహాగానాలు రావడంతో ఇలా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ‘అన్నాతే’ సినిమాలో నటిస్తున్న రజనీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ మధ్యే అమెరికాకు వెళ్లి వచ్చాడు. కరోనా, తమిళనాడు ఎన్నికలు, అమెరికా చెకప్‌ నేపథ్యంలో అభిమానులకు ఇంతకాలం దూరంగా ఉన్నానని, ఈ నేపథ్యంలోనే సమావేశం అయ్యానని మీడియాకు స్పష్టం చేశారు. రజనీ మక్కల్ మండ్రం పార్టీని ఆయన రద్దు చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. అయితే దీనిని కేవలం ఫ్యాన్స్ క్లబ్‌గా మాత్రం కొనసాగిస్తానని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

twenty + sixteen =

Back to top button