More

  రాజ్ దీప్ సర్దేశాయ్ రసగుల్లా జర్నలిజం

  లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు ఎప్పుడు వంకరగానే మాట్లాడుతు ఉంటారా? వారికి కక్కుర్తి బుద్ది మరి ఎక్కువగా ఉంటుందా? అవకాశం దొరికినప్పుడుల్లా జర్నలిజం గురించి.., జర్నలిస్టుల బాధ్యతలు, విలువల గురించి, మళ్లీ ఈ లుటియెన్స్ గ్యాంగే తెగ లెక్చర్లు ధంచేస్తూ ఉంటుంది.
  దేశహితమనేది తమకు సెంకడరీ అంశం అన్నట్లుగా ఈ లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ జర్నలిస్టులు వ్యవహారిస్తుంటారనే పేరుంది. ఇంతకీ వారి ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా ? స్వలాభం..! జర్నలిజాన్ని ఆసరగా చేసుకుని తమ లైఫ్ ను సెట్ చేసుకుంటారు! అందుకోసం ఎంతకైనా దిగజారిపోతారు.
  అధికారంలో ఉన్నవారిని.., వారికి కష్టం.., నష్టం కలిగించకుండా.., కేవలం వారికి నచ్చిన ముఖస్తుతి ప్రశ్నలు వేసి.., వారు ఇచ్చిన సమధానాలకు క్రాస్ క్వశ్చన్ చేయకుండా, వారిని సంతోష పెడతారు. ఇంకేం జర్నలిజం రంగలో వారు చేసిన సేవకు గుర్తుగా పద్మ పురస్కారాలు వస్తుంటాయి. యూపీఏ హయంలో పద్మపురస్కారం పొందిన పేరు మోసిన లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ జర్నలిస్ట్ గా రాజ్ దీప్ సర్దేశాయ్ కి పేరుంది. సోనియా గాంధీ కుటుంబానికి జర్నలిజం రంగంలో బాగా నచ్చిన ముఖం కూడా రాజ్ దీప్ సర్దేశాయేనంటారు కొంతమంది ప్రముఖులు.
  ఇక రాజ్ దీప్ సర్దేశాయ్ విషయానికి వస్తే… 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగిన సమయంలో మరే చానల్ కు ఆ టెర్రరిస్టు అటాక్ ను కవర్ చేయకుండా, వారికి కనీసం విజువల్స్ దొరకుండా, తమ చానల్ కు మాత్రమే ఎక్స్ క్లూజివ్ విజువల్స్ దొరికేలా రాబంధుల్లా వ్యవహారించామని..ఆ రోజు తాను చేసిన ఘన కార్యాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
  తాజాగా ఇప్పుడు కూడా అలాంటి విషయాన్ని బయటపెట్టాడు రాజ్ దీప్ సర్దేశాయ్. ఇప్పుడు అదేంటో మనం తెలుసుకుందాం.
  గతవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చారు. విపక్షాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. అలాగే తనకు నచ్చిన కొంతమంది లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ జర్నలిస్టులకు ఆమె ఒక పార్టీ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికలతోనే తన ఆట ముగియ లేదని దేశ వ్యాప్తంగా బీజేపీని నిలువరించేందుకు తన ఆటను కొనసాగిస్తానని ఖేలా హోబ్ అంటూ జర్నలిస్టులతో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ తెలిపారు.
  అయితే… కేవలం బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తృణమూల్ కాంగ్రెస్ కు 2024లో దేశ వ్యాప్తంగా ఆదరణ ఉంటుందా? దేశంలోని మిగిలిన అన్నిరాష్ట్రాల ప్రజలు మమతా బెనర్జీని ఆదరిస్తారా? మరి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల సంగతి ఏంటీ?
  ఇంకా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత… తృణమూల్ కార్యకర్తలు జరిపిన హింసాకాండపై మమతా మనోగతం ఏంటీ ? ఎందుకు తృణమూల్ కాంగ్రెస్ జరిపిన హింసాకాండపై మమతా బెనర్జీ మౌనంగా ఉన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వుమెన్ రైట్స్ కమిషన్, హైకోర్టు, సుప్రీం కోర్టు అంతా కూడా మమత ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కూడా.., హింసాకాండకు పాల్పడిన దోషులపై ఆమె ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? వంటి ప్రశ్నలు సంధించాల్సిన ఈ లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు…, ఆ సమావేశంలో మమతా బెనర్జీ చెప్పింది విన్నారు తప్పా… కనీసం ఆమెను క్రాస్ క్వశ్చన్ చేయలేకపోయారు.
  ఇదే…విషయంపై రాజ్ దీప్ సర్దేశాయ్ ను ప్రముఖ సోషల్ మీడియా జర్నలిస్టు లల్లాన్ టాప్ ఎడిటర్ సౌరభ్ ద్వివేది కూడా ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ కార్యకర్తలపై, తృణమూల్ గుండాలు జరిపిన హింసాకాండపై మీరు మమతా బెనర్జీని ఆ సమావేశంలో ఎందుకని ప్రశ్నించలేకపోయారని అడిగాడు. అందుకు రాజ్ దీప్ ఏమి చెప్పాడో తెలుసా? తాను ఆ సమావేశంలో ఆమెను ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్లలేదని, బెంగాల్ ఎన్నికల్లో ఆమె గెలిచిందని, అందుకు ఆమెను అభినందించానని, అది చిన్నపాటి చాయ్ పే చర్చ కార్యక్రమమని, ఆ సమావేశంలో నేను బెంగాల్ లో తృణమూల్ జరిపిన హింసాకాండను ప్రస్తావిస్తే.. బెంగాల్ నుంచి మమతా బెనర్జీ తీసుకుని వచ్చిన రసగుల్లాలను తాను తినలేకపోయేవాడినని.., ఆ ప్రశ్న అడిగినందుకు మమతా తనకు రసగుల్లాలు ఇచ్చేవారు కాదని..వాపోయాడు.
  దీంతో రాజ్ దీప్ స్టేట్ మెంట్ విన్న ద్వివేది ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకుల ఇచ్చే రసుగుల్లాలు తిన్న తర్వాత ఇక మీరు పాత్రికేయం ఏమి చేస్తారు? అంటూ ద్వివేది తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
  రాజ్ దీప్ సర్దేశాయ్ నకిలీ వార్తలు సృష్టించి దాన్ని వైరల్ చేయడంలో దిట్టగా పేరుంది. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో రైతుల పేరుతో గణతంత్ర దినోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతోపాటు, అలాగే ఎర్రకోటపై జాతీయ జెండాను అవమానించిన సంఘటనలు, పోలీసులపై దాడులు జరిగాయి. ఆ సమయంలో ట్రాక్టర్ తిరగబడి ఒక ఆందోళనకారుడు మరణించడం జరిగింది. పోలీసులు కాల్పులు జరపడం వల్లే అతను మరణించాడని ట్విట్ చేశారు రాజ్ దీప్ సర్దేశాయ్. వెంటనే ఢిల్లీ పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ను మీడియాకు విడుదల చేశారు. అందులో ట్రాక్టరు నిర్లక్ష్యంగా స్పీడ్ గా నడిపడం వల్లే అతను మరణించినట్లు తేలింది. ఉద్రికత్తలు నెలకొన్న ఆ సమయంలో… తప్పుడు వార్తను ప్రచారం చేసి రాజ్ దీప్ సర్దేశాయ్ రెడ్ హ్యాండెడ్ గా దేశ ప్రజల ముందు దొరికిపోయాడు. అతని వల్ల పరువుపోయిన ఇండియా టుడే యాజమాన్యం.., నెల రోజులపాటు రాజ్ దీప్ ను విధుల నుంచి తొలగించిన విషయం మనం మర్చిపోరాదు. సో ఇలాంటి లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాతీయవాద జర్నలిజాన్ని పోత్సహించాలి. జై హింద్.

  Trending Stories

  Related Stories