క్రైంస్థాన్ గా మారిన రాజస్థాన్ లో ప్రతి నిత్యం ఏదోపాడు పని జరగడం రివాజుగా మారింది. చెడ్డపనులను ఇష్టాలుగా చేసుకుని ఇష్టామిస్టులుగా మారిన ఇస్లామిస్టులు చేస్తున్న దారుణాలు, దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. పవిత్ర దేవాలయం విశిష్టత పైశాచిక మనస్కులకు ఏం తెలుస్తుంది. అందుకే..పాపపు పనుల్లో నిండా మునిగిపోతున్నారు. రాజస్థాన్‌లో నలుగురు ముస్లిం యువకులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. పవిత్ర గోవర్ధన్ పూజ ప్రసాదాన్ని నేలపైకి విసిరికొట్టారు.
నివేదికల ప్రకారం…రాజస్థాన్ అల్వార్ భివాడి జిల్లాలో ఘాతుకం చోటుచేసుకుంది. షేక్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హమిరాకా గ్రామ శివ మందిరంలో దళిత వర్గానికి చెందిన హిందువులు అత్యంత భక్తిశ్రద్దలతో గోవర్దన్ పూజ చేశారు. అనంతరం అన్నకూట్ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నారు. ఈ సమయంలో…ముస్లిం వర్గానికి చెందిన నలుగురు యువకులు ఆలయంలో బీభత్సం సృష్టించారు. ప్రసాదాన్ని విసిరేశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దళిత భక్తులు, స్థానికులపై అనుచితంగా ప్రవర్తించి, దాడులకు తెగబడ్డారు.
ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహం అని…ఆ ప్రసాదాన్ని తిరస్కరిస్తేనే మహాపాపం చుట్టుకుంటుందని సకల వేదాలు, సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎద్దు మొద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు…ఈ మందబుద్ది ఇస్లాంగ్యాంగ్ కు ఏం తెలుసు మహా ప్రసాద మహోన్నత. దైవ అనుగ్రహం కోసం హిందూ బంధువులు ఆరాట పడుతుంటే…, పవిత్ర ప్రసాదాన్ని నేలకు కొట్టి..హిందూ భక్తుల మనోభావాలు గాయపరుస్తున్నారు. దైవాగ్రహానికి గురవుతే పుట్టగతులుండవనే విషయం ఇస్లామిస్ట్ వేస్ట్ గ్యాంగ్ ఎందుకు గ్రహిస్తుంది.
ఇస్లామిస్టుల అనుచిత చర్యలను ఖండించాల్సిన కాంగ్రెస్ పాలకులు..ఆ పనిని గాలికొదిలేసి, చోద్యం చూడ్డానికి వస్తున్నారని రాజస్థాన్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులు ముబారక్, ముఫీద్, తలీమ్, జోమ్ ఖాన్ లను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని హిందూ బంధువులు డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సందీప్ యాదవ్ ఘటనాస్థలికి వచ్చారు. అయితే, ఆయన వాలకం చూస్తే, ఆందోళనను బలహీన పర్చడానికి, నిందిత గ్యాంగ్ లను రక్షించడానికి వచ్చినట్టు కనిపించింది. బీజేపీ కార్యకర్తలు ఆయన వైఖరీపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
బాధితులు షేక్‌పురా పోలీసులకు తమ గోడు తెలియజేశారు. తమకు న్యాయం చేయమని కోరారు. అయితే, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని, నిందితులకు వత్తాసుగా మాట్లాడారని బాధితులు వాపోయారు. దీంతో కోపోద్రిక్తులైన హిందూ బంధువులు.. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. భివాడి మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ సందీప్ దయామా, మాజీ ఎమ్మెల్యే మమన్‌సింగ్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అభయ్‌సింగ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. పాలకులు, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, పోలీసులు తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ విపిన్ శర్మ తెలిపారు.