మునుగోడులో నైతిక విజయం నాదే : రాజగోపాల్ రెడ్డి

0
712

మునుగోడు ఉప ఎన్నికలో నైతికంగా విజయం తనదే అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 31 వరకు ధర్మం నిలిచిందని.. నవంబర్ 1 నుంచి అధర్మం నిలిచిందన్నారు. టీఆర్ఎస్, మందు, డబ్బుతో అధర్మానికి పాల్పడింది. రిటర్నింగ్ అధికారి కనీసం నిబంధనలు పాటించలేదన్నారు. నన్ను మా నేతలను కట్టడి చేశారు.. ఈ ఎన్నికల్లో అధర్మం గెలిచింది. నైతికంగా విజయం నాదే అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. గుర్తుల కేటాయింపు నుంచి కూడా దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు కౌరవ సైన్యం వచ్చింది.. టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందంటూ రాజగోపాల్ రెడ్డి అన్నారు.

12 రౌండ్లో టీఆర్ఎస్ కు 2,042 ఓట్ల భారీ అధిక్యం లభించింది. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,440, బీజేపీకి 5,398 ఓట్లు లభించాయి. 12 రౌండ్లు ముగిసేసరికి గులాబీ పార్టీ ఆధిక్యం 7,807 ఓట్లకు పెరిగింది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ కు 82,005, బీజేపీకి 74,198, కాంగ్రెస్ కు 17,627 ఓట్లు లభించాయి. మరో మూడు రౌండ్ల లెక్కింపు మిగిలుండగా, టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది.