సాయి పల్లవి వ్యాఖ్యలపై రాజా సింగ్ రెస్పాన్స్ ఇదే

0
765

సాయిపల్లవి వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెల్సిందే..! ఆమె వ్యాఖ్యలను కశ్మీర్ పండిట్లు, హిందూ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. హిందువులపై కామెంట్లు చేస్తే సహించబోమని చెప్పారు. సాయి పల్లవిని అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కశ్మీర్ కు వెళ్లి అక్కడి పండిట్లను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో సాయిపల్లవిపై కేసులు పెట్టాలని ఆయన కోరారు. ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరు హిందువుల జోలికి రారని చెప్పారు. తాము పాపులర్ కావాలని, తమ సినిమా పాపులర్ కావాలని కొందరు నటీనటులు, దర్శకులు వ్యవహరిస్తుంటారని అన్నారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడయిందని వ్యాఖ్యానించారు. ముస్లింల పైన, క్రిస్టియన్స్ పైన కామెంట్ చేసే దమ్ము మీకుందా? అని ఆయన ప్రశ్నించారు.