Telugu States

ఏపీలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతారట.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజా సింగ్

కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని అధికార పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఓ వైపు అధికార పక్షం, విపక్షాలు విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. వైసీపీకి చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతితోనే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.ప్రభుత్వ స్థలంలో అనుమతి లభించకపోతే ప్రైవేటు స్థలంలో అయినా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రంలో ఏ విగ్రహానికి అనుమతులు లేవని, ఆయా సందర్భాలను బట్టి అధికారులు మౌనంగా ఉంటారని అన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటివి కాదని, జిల్లా ఎస్పీ అభ్యర్థన మేరకు గత నెల 24న ఇచ్చినవని తెలిపారు. తాము దేశద్రోహులు, మతోన్మాదుల విగ్రహాలేమీ పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడా? కాదా? అనేది రాజ్యాంగం, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేతలు ఓ వైపు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. అసలు టిప్పు సుల్తాన్ గురించి శివప్రసాద్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హిందువులను ఎలా టార్గెట్ చేశాడనే సమాచారం మీ దగ్గర ఉందా అని ప్రశ్నించారు. మత మార్పిడులు చేసిన వ్యక్తి టిప్పు సుల్తాన్ అని.. టిప్పు సుల్తాన్ గురించి కొత్త పుస్తకాలు చదవకండని అన్నారు. ఆయన పాత పుస్తకాలు చదివితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మైసూర్ ప్యాలేస్ లో టిప్పు సుల్తాన్ తల్వార్ ఉంది ఆ తల్వార్ పైన ఉర్డులో రాసి వుంటుంది వెళ్లి చూడు దాని అర్థం ఏంటో తెలుసుకో అని రాజా సింగ్ అన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి పొలిటికల్ మైలేజ్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. హందూ ధర్మాన్ని నాశనం చేసిన వ్యక్తి టిప్పు సుల్తాన్ అని.. మీకు విగ్రహాల పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే.. ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగాలు చేసిన వారి విగ్రహాలు, దేశం కోసం పని చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

20 − seven =

Back to top button