More

    తన బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి చాలా విషయాలు చెప్పిన రాజా సింగ్

    గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు పోలీసులు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల నుంచి ప్రాణ హాని ఉన్న రాజా సింగ్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు గతంలో పలు చోట్ల నిలిచిపోయిన సంగతి తెలిసిందే..! ఎప్పుడూ ఆ కారుకు ఏదో ఒక రిపేరీ ఉంటుందని.. రిపేర్లతో నిత్యం సతమతం చేసే బుల్లెట్ ప్రూఫ్ కారును తనకు సమకూర్చారని అసహనం వ్యక్తం చేశారు. తనకు పొంచి ఉన్న ముప్పుపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదేశాలు జారీ చేస్తే … రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కారును అమర్చారని.. ఆ కారు కాస్తా నిత్యం రిపేర్లకు గురి అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల క్రితం నడిరోడ్డులోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే దానిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించానని ఆయన అన్నారు. ఈ క్రమంలో మంచి కండిషన్ లో ఉన్న వాహనాన్ని పంపడానికి బదులుగా పోలీసులు నిలిచిపోయిన వాహనానికి రిపేర్లు చేసి పంపారన్నారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు వెళుతుండగా రోడ్డుపైనే వాహనం ఆగిపోయిందని అన్నారు. గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లానన్నారు. ఇటీవలే అప్జల్ గంజ్ లోనూ ఆ వాహనం ఆగిపోగా ఇంటి నుంచి సొంత వాహనాన్ని రప్పించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories