National

ఎట్టకేలకు బెయిల్ దక్కించుకున్న రాజ్ కుంద్రా..!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది. రూ.50 వేల పూచీకత్తుతో ముంబయి కోర్టు రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల చిత్రాలు నిర్మించడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసులు జులై 19న అరెస్ట్ చేశారు. రాజ్ కుంద్రాపై ముంబయి పోలీసులు 1,400 పేజీల భారీ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో ముఖ్యుడు రాజ్ కుంద్రానే అని, మరికొందరు వ్యక్తులతో కలిసి యువతులను మభ్యపెట్టి అశ్లీల చిత్రాల ఉచ్చులోకి దించేవారని పోలీసులు చార్జిషీటులో తెలిపారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడేవారిని గుర్తించి, అశ్లీల చిత్రాల వైపు మళ్లించేవారని ఆరోపించారు. అయినప్పటికీ రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది.

రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుండి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకు ముందు తనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్‌కుంద్రా భారీగా లంచం ఇచ్చాడనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని.. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ అలియాస్‌ యశ్‌ ఠాకూర్‌ పోలీసులకు పంపిన ఓ మెయిల్‌లో ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించగా రాజ్‌ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మార్చిలో ఏసీబీకి పంపిన ఈమెయిల్‌లో తెలిపారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. ఇదే కేసులో అప్పట్లో రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్‌ చేయమని ఓ పోలీస్‌ రాయబారం చేసినట్లు ఈమెయిల్‌లో అరవింద్‌ తెలిపారు. పోర్న్ చిత్రాలను రూపొందిస్తూ ఉన్నారనే ఆరోపణలపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఫిబ్రవరిలోనే కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు బెయిల్ పై బయటకు వచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 14 =

Back to top button