శుభాకాంక్షల్లోనూ హిందూ ద్వేషమేనా..? రాహులా.. నువ్విక మారవా..?

0
820

మేక వన్నె పులి, గోముఖ వ్యాఘ్రం.. ఈ పదాలు సాధారణంగా విలన్ వేషధారులకు సూటవుతాయి. అయితే, సర్వజన సంక్షేమం, మతసామరస్యం అంటూ లెక్చర్లు దంచే కొందరు బడా నాయకులు.. విలనిక్ ప్రవృత్తితో అతి తెలివి ప్రదర్శిస్తూంటారు. వారికి ఇంతకంటే గొప్ప పదాలు ఏమైనా వుంటే.. డిక్షనరీలు వెదికి పట్టుకోవాల్సి వుందేమో.

సమ్‎థింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్.. ఈ ప్రోవెర్బ్‎ను ఆధారంగా చేసుకునో, ఏమో.. ప్రస్తుత కాంగ్రెస్ మూలస్తంభం రాహుల్ గాంధీ.. దసరా శుభాకాంక్షలు చెబుతూ.. హిందూ దైవాల మాటను విస్మరించారు. పైగా నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్సెన్స్ అనే సామెత గుర్తు తెచ్చేలా చేశారు.

అందరి నేతల మాదిరి రాహుల్ గాంధీ పండుగలకు, పబ్బాలకు శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే, హిందూ పండుగలకు అభినందనలు తెలిపే సమయంలో హిందూ దైవాల పేరు ఎత్తకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారు. తాజాగా దసరా పండువలో సైతం రాహుల్.. తన పాత సంప్రదాయాన్ని పాటించారు. హిందు పండుగలో.. హిందూ దైవాలను విస్మరించి శుభాకాంక్షలు చెప్పారు.

“భారతీయులందరికీ దసరా శుభాకాంక్షలు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, హిందూ సమాజం గురించి కాని, హిందూ దైవాల గురించి కాని ఎటువంటి ప్రస్తావన చేయలేదు. అసలు దసరా అంటేనే.. చెడ్డపై మంచి సాధించిన దైవిక కార్యం అని హిందూ పురాణాలు తెలియజేస్తాయి.

కాంగ్రెస్ వారసుడు తన ట్వీట్ లో ఇంకా ఇలా రాశారు. ద్వేషం లంకను కాల్చివేయనివ్వండి, హింసాకాండకు ముగింపు పలకండి. అహంకార నిర్మూలనతో సత్యం, న్యాయానికి విజయం ఉంటుందని ఆశిస్తున్నాను అని రాశారు. సందర్భరహిత సందేశాలు ఇవ్వడంలో ఘనుడుగా పేరొందిన రాహుల్.. హిందూ పండువల శుభాకాంక్షల్లో.. హిందువులను, హిందూ దైవాలను, హిందూ సంప్రదాయాలను విస్మరించి.. అభినందనలు తెలపడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దసరా రాక్షస రాజు రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని సూచిస్తుంది, చెడ్డపై మంచి విజయానికి సంకేతంగా ఈ పండువను ఉదహరిస్తారు. ఇది హిందూ పండుగ. మరి, రాహుల్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవా.. లేక సమాజంలోని ఒక వర్గాన్ని సంతృప్తిపర్చడానికి చేస్తున్నవా అనే విషయంపై సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు దర్శనమిస్తున్నాయి.

రాహుల్ గాంధీ చాకచక్యంగా హిందూ దేవతల చిత్రాలను పంచుకోవడం మానేశారు. ఇలాంటి పద్ధతిని ఆశ్రయించడం ఇదే మొదటిసారి కాదు. జూలైలో, రాహుల్ గాంధీ ‘రథయాత్ర’ అనే పదంతో కూడిన ఇన్ఫోగ్రాఫిక్, మూడు ‘ఖాళీ’ రథాల చిత్రాన్ని చేర్చారు. జగన్నాథ రథ యాత్ర పండుగ సందర్భంలో.. కాంగ్రెస్ నాయకుడి ట్విట్టర్ పోస్ట్ లో జగన్నాథుడు, దేవి సుభద్ర, బలభద్ర దైవాల చిత్రాలు లేవు. ఏప్రిల్ 2020లో శ్రీరామ నవమి సందర్భంగా, రాహుల్ గాంధీ ‘శ్రీరామ నవమి’ అని రాసి ఉన్న ఇన్ఫోగ్రాఫిక్‌ను పోస్ట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోస్టులో దేవ దేవుడైన శ్రీరామచంద్రుడి చిత్రం లేదు. దీనికి నెల రోజుల ముందు, సరస్వతీ పూజ సందర్భంగా ఓ అనుచిత వ్యవహారం జరిపారు. హిజాబ్ వరుసను లాగడం ద్వారా పండుగను రాజకీయం చేస్తూ హిందువులను అవమానించారు.

గత సంవత్సరం, కాంగ్రెస్ నాయకుడు గణేష్ చతుర్థి శుభ సందర్భంగా తన అనుచరులకు శుభాకాంక్షలు తెలిపారు. అతను ‘గణేష్ చతుర్థి కి హార్దిక్ శుభకామ్నాయే’ అనే శాసనంతో గ్రాఫిక్‌ను పంచుకున్నాడు. అయితే, ట్వీట్‌లో గణేష్ చిత్రం లేకపోవడ గమనార్హం. మరో సందర్భంలో, రాహుల్ గాంధీ, శ్రీ కృష్ణ జన్మాష్టమినాడు హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, జన్మాష్టమి సందర్భంగా పూజించే చిన్ని కృష్ణుడి చిత్రం లేదు. అంతకు ముందు.. మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన రాహుల్, తన ట్వీట్‌లో శివదేవుని చిత్రాలను విస్మరించారు. అయితే, కైలాస పర్వతాల చిత్రాన్ని ఉంచడం కొంతలో కొంత సంతోషం.

హిందువులపై అంతర్గతంగా ఉన్న కోపాన్ని.. రాహుల్ గాంధీ ఈ రీతిలో వ్యక్తం చేస్తున్నారని కొందరు నెటిజన్లు, హిందువులపై రాహుల్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. హిందూ పండుగలను సెక్యులరైజ్ చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని ఇంకొందరు పోస్ట్ చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × two =