More

    తెలంగాణ రాష్ట్రంలో మొదలైన రాహుల్ గాంధీ యాత్ర

    రాహుల్ గాంధీ చేస్తోన్న ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర రెండోరోజు తెలంగాణలో ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజామున మక్తల్ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టారు. దండు, కాచ్వార్ మీదుగా బొందలకుంట వరకు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీతో కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నారు.

    ఈనెల 23న పాలమూరు జిల్లాలో ప్రారంభమైన యాత్ర దీపావళి సందర్భంగా విరామం ప్రకటించగా ఇవాళ మళ్లీ ఉదయం మొదలైంది. రాహుల్ భారత్ జోడో యాత్ర 16 రోజుల పాటు తెలంగాణలో సాగనుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తారు. తెలంగాణలో పాదయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఈనెల 30న షాద్నగర్కు కాంగ్రెస్ నేత రాహుల్ యాత్ర చేరుకోనుందని టీపీసీపీ ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడులో మహిళా గర్జన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు మహిళా గర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    Trending Stories

    Related Stories