Special Stories

రాముడి పేరుతో ఇన్ని కుట్రలా..?
రాహులా నువ్విక మారవా..?!

హైందవ సంస్కృతిపై నమ్మకం లేదు. హిందూ దేవుళ్లపై భక్తిలేదు. భారతీయ సంప్రదాయాలపై శ్రద్ధ లేదు. కానీ, ఆయనకు ఈ దేశాన్ని ఏలాలని.. గంపెండంత యావ మాత్రం వుంది. ఎవడో ఏదో పోస్టు పెట్టాడని.. వెనకాముందూ చూడకుండా.. తప్పో ఒప్పో తెలుసుకోకుండా విషం కక్కుతాడు. తీరా నిజం తెలిసేసరికి దేశ ప్రజల నుంచి చివాట్లు తింటాడు. అతనెవరనే కదా మీ ఆలోచన. గాంధీ కుటుంబ వారసత్వ ఆణిముత్యం.. ఈ దేశాన్ని పాలించాలని ఉవ్విళ్లూరుతున్న మణిమాణిక్యం.. కాంగ్రెస్ ఆల్ టైమ్ ప్రిన్స్ రాహుల్ గాంధీ. ది గ్రేట్ వయనాడ్ ఎంపీ. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామ చంద్రుడికి సంబంధించి.. ట్విట్టర్‎లో ఫేక్ న్యూస్‎ను షేర్ చేసి అభాసుపాలయ్యాడు. కేవలం రెండు రోజుల్లో రెండుసార్లు ఇలాంటి ఘనకార్యానికి పాల్పడ్డాడు.

ఇటీవల యూపీలోని ఘజియాబాద్‎లో.. కొందరు యువకులు ఓ ముస్లిం వృద్ధుడిని చావబాదుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయనందుకే ఆ వృద్ధుడిని కొట్టారని,.. పైగా నుదిటిపై తుపాకీ పెట్టి బెదిరించారని.. ఓ హిందీ వార్తాపత్రిక అబద్ధపు వార్తను అందంగా వండి వార్చింది. అయితే, ముందూ వెనకా ఆలోచించకుండా ఈ న్యూస్ క్లిప్పింగ్‎ను రాహుల్ గాంధీ.. తన ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు.

నిజానికి, వృద్ధుడిని కొట్టిన కారణం వేరేనని.. కాంగ్రెస్ అనుకూల మీడియాగా చెప్పుకునే ‘ఆల్ట్ న్యూస్’.. ఈ విష ప్రచారానికి ఒడిగట్టిందని ఘజియాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఈ వార్తను మొదట పోస్ట్ చేసిన ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపడుకు మహమ్మద్ జుబేర్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

ఘజియా పోలీసుల కథనం ప్రకారం.. బాధిత వృద్ధుడు అబ్దుల్ సమద్ సైఫీ.. స్థానికంగా తాయెత్తులు కడుతూ వుంటాడు. ఈ నేపథ్యంలో సమద్ కట్టిన తాయెత్తు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కొందరు.. అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పర్వేష్ గుజ్జర్, ఆదిల్, కల్లు అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనకు మత విద్వేషంతో సంబంధం లేదని.. ‘జైశ్రీరామ్’ నినాదం చేయనందుకే కొట్టారనడం ఒట్టి పుకారని తేలిపోయింది.

నిజానికి, రాహుల్ గాంధీ ట్విట్టర్‎లో పోస్ట్ చేయముందే.. అది ఫేక్ న్యూస్ అని ఘజియాబాద్ పోలీసులు తేల్చేశారు. జూన్ 15 తెల్లవారుఝామున ఒంటి గంటా 44 నిమిషాలకు ఘజియాబాద్ పోలీసులు ఈ ఘటన గురించి ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన దాదాపు 14 గంటల తర్వాత.. అంటే జూన్ 15 సాయంత్రం 4 గంటల 21 నిమిషాలకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంటే, రాహుల్ గాంధీ సోషల్ మీడియా టీమ్‎కు అసలు విషయం కచ్చితంగా తెలిసేవుంటుంది. సరే, అనుకోకుండా పోస్ట్ చేశారా అంటే.. ఘజియాబాద్ పోలీసుల పోస్టుకు, రాహుల్ గాంధీ పోస్టు 14 గంటల తేడా వుంది. ఇన్ని గంటలపాటు వార్తకు సంబంధించిన అప్ డేట్.. తెలియకుండా వుండే అవకాశమే లేదు. అంటే, అన్నీ తెలిసి కూడా రాముడి పేరుతో ఓ నకిలీ వార్తను ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. పైగా రాముడి నిజమైన భక్తులు ఇలా చేస్తారని తాను అనుకోవడం లేదని.. ఇది నమ్మశక్యంగా లేదని.. రాహుల్ గాంధీ కొటేషన్లు ఇచ్చాడు. ఈ రకమైన క్రూరత్వం అమానవీయతకు నిదర్శనమని.. ఇది సమాజానికి, మతానికి హానికరమని హితోక్తులు పలకడం ఆయనకే చెల్లింది.

దీనికి సరిగ్గా ఒక రోజు ముందు కూడా రాముడి పేరుతో ఇలాగే అబద్ధాలను వైరల్ చేశాడు రాహుల్ గాంధీ. ఆమ్ ఆద్మీ పార్టీతో జతకలిసి.. అయోధ్య ఆలయ భూములపై అబద్ధాలు వండి వార్చాడు. అయోధ్య భూముల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ.. ‘రామ్ మందిర్ ఘోటాలా’ అంటూ నానా రభస చేశాడు. రాముడి పేరు చెబుతూ అధర్మాలు చేస్తున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశాడు.

ఇది కూడా కుట్రపూరితమైన ఫేక్ న్యూస్ అని తేలిపోవడంతో కాంగ్రెస్ యువరాజుకు సోషల్ మీడియాలో జనం చివాట్లు తప్పలేదు. ఇలా రాముడిని అడ్డం పెట్టుకుని రాద్దాంతం చేయబోయి అభాసుపాలు కావడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. గతంలో రాముడి ఉనికినే ప్రశ్నించిన చరిత్ర ఆ పార్టీ సొంతం. 2007 సెప్టెంబర్‎లో రాముడు ఉన్నాడని చెప్పడానికి అసలు చారిత్రక ఆధారాలే లేవని హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. నాటి యూపీఏ సర్కార్ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫడవిట్‎లో రాముడు లేడని చెప్పడానికి శాయాశక్తులా ప్రయత్నించింది. వాల్మీకి రామాయణాన్ని, రామచరిత మానస్ వంటి ప్రాచీన భారత సాహిత్యాల్లో.. రాముడు ఒక భాగమని తెలిపింది. అయితే, రాముడు ఉన్నాడని చెప్పడానికి ఆ గ్రంథాలు సరిపోవని.. వితండవాదం చేసింది. రామసేతుకు నష్టం కలిగించేవిధంగా అప్పట్లో సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. అటు కేసు కాస్తా కోర్టుకెళ్లింది. అయితే, కోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ సమర్పించిన నాటి యూపీఏ ప్రభుత్వం.. హిందువుల మనోభావాలు గాయపడేలా వ్యాఖ్యలు చేసింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కుట్రలు చాలా వున్నాయి.

రాహుల్ గాంధీ సన్నిహితుడు, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కపిల్ సిబల్.. నాడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. అంతేకాదు, ఈ కేసును 2019 ఎన్నికల దాకా వాయిదా వేయడం కోసం శాయాశక్తులా ప్రయత్నించాడు. అయితే, తాను కేవలం ఓ న్యావాదిగా పోరాడుతన్నానని.. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని.. నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, చిలకపలుకులు నమ్మడానికి దేశప్రజలంతా రాహుల్ గాంధీ అభిమానులు కాదని బహుశా ఆయనకు తెలియదేమో.

కపిల్ సిబల్ ఒక్కడే కాదు.. కాంగ్రెస్‎లో శశిథరూర్ అనే మహా మేధావి కూడా వున్నాడు. ఈయన ఇంకో ఆకు ఎక్కువ చదివాడు. అసలు బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో రామాలయాన్ని కట్టాలని ఏ మంచి హిందువు కోరుకోడని అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇవన్నీ మరిచిపోయిన రాహుల్ గాంధీ.. ఒక్కసారిగా నిద్ర నుండి ఉలిక్కిపడి లేచినట్టు ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుతున్నాడు. ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్లు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయినట్టుంది. నిజం చెప్పాలంటే, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాలని కూడా ఆయన అనుకోడు. తన మీడియా మిత్రులపై అంత నమ్మకం. ఇలాంటి, నకిలీ వార్తలకు కర్మ, క్రియ, కర్తలు ఆయన మీడియా మిత్రులే. ఈ ఫేక్ న్యూస్ కు ఆల్ట్ న్యూస్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. రాహుల్ గాంధీ ట్విట్టర్ మీట నొక్కాడంతే..!

సరిగ్గా ఇదే రీతిలో కాంగ్రెస్ టూల్ కిట్లు కూడా తయారువుతున్నాయి. కరోనా విషయంలో మోదీ ప్రభుత్వంపై బుదర జల్లడానికి,.. అప్పట్లో కుంభమేళాను అస్త్రంగా వాడుకోవాలని భారీ ప్రయత్నాలే చేసింది. అయితే, అది కూడా ఆల్ట్ న్యూస్ పన్నాగమని.. ఆ తర్వాత తెలిసిపోయింది. హిందువుల పట్ల వ్యతిరేకతను పెంచిపోషించడానికే ఇప్పుడు ‘జైశ్రీరామ్’ నినాదాన్ని కూడా వాడుకుంటోంది. ఇలా చిన్న చిన్న సంఘటనలు నేరాలుగా చిత్రీకరించి.. మైనార్టీల్లో హిందువుల పట్ల మరింత ద్వేషం కలిగేలా చేయడం.. ఈ ఘటనల వెనుకున్న ప్రధా లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇలా రాముడి ఉనికిని ప్రశ్నించడం, రాముడికి సంబంధించిన విషయాలపై నకిలీ వార్తలను వ్యాప్తిచేయడం.. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయింది. ఎన్నికలప్పుడు తాను జన్యుధారీ బ్రాహ్మణుడినని చెప్పుకుంటూ.. గుళ్లూ గోపురాలు తిరిగే రాహుల్ గాంధీ.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టుకుంటూ వుంటాడు. ఇందులో భాగంగా అయోధ్య రాముడి విషయంలో అబద్ధాలు ప్రచారం చేసి.. జనాన్ని నమ్మించబోయి బోల్తా పడ్డాడు రాహుల్.

అయితే, ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘జైశ్రీరామ్’, ‘అయోధ్య’ జపం చేయడానికి పెద్ద కారణమే వుంది. అది తెలియాలంటే, ఇంకాస్త లోతుగా పరిశీలించాల్సివుంటుంది. దశాబ్దాలుగా సాగిన వివాదాల తర్వాత.. నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవతో అయోధ్య వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. దేశం నలుమూలల నుంచి హిందువులు తాము కష్టపడి సంపాదించిన దాంట్లోనుంచి రామయ్య కోవెల కోసం పదో పరకో సమర్పించుకున్నారు. అలా పోగైన ధనంతో అయోధ్యలో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఆలయ నిర్మాణం పూర్తయితే, ఆ క్రెడిట్ అంతా నరేంద్ర మోదీ ఖాతాలోకి వెళ్లిపోతుంది. అలా జరక్కుండా వుండాలంటే, ఎదోలా ఆలయ నిర్మాణానికి అడ్డుపడాలి. అందుకే, ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. లెఫ్ట్ లిబరల్, మతోన్మాదులతో కలిసి.. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుట్రలు పన్నుతున్నట్టు ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుంది.

ప్రతి హిందువు ఇలాంటి కుట్రలకు ఎదురు నిలబడిపోరాడాల్సిన సమయమిది. ఇందుకోసం ఆందోళనలు, నిరసనలు చేపట్టాల్సిన పనిలేదు. కుటిల కాంగ్రెస్, కన్నింగ్ కమ్యూనిస్టులపై ఓ కన్నేసి ఉంచితే చాలు. హిందువులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి గానీ, లెఫ్ట్ లిబరల్ విదేశీ పెంపుడు మీడియా శక్తుల నుంచి గానీ, సోషల్ మీడియాలో ఏదైనా వార్త వచ్చిందంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నమాట. కొద్ది గంటల్లోనో లేదా కొన్ని రోజుల్లోనో నిజాలు సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వస్తాయి. అప్పుడు పాలకు పాలు, నీళ్లు నీళ్లు తేలిపోతాయి. మతాల మధ్య చిచ్చులు పెడుతున్నదెవరో.. కులగజ్జిని రాసుకుని తిరుగుతున్నదెవరో.. స్పష్టంగా తెలిసిపోతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =

Back to top button