3గంటల పాటు ప్రశ్నల వర్షం.. చివరికి రాహుల్ గాంధీ..!

0
736

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు విచారించిన అధికారులు.. ఆయనను మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లిన రాహుల్‌ను.. మూడు గంటలపాటు విచారించారు అధికారులు. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి రాహుల్‌ గాంధీ ఇంటికి వెళ్లిపోయారు.

సోమవారం ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ముగ్గురు అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మూడు గంటల పాటు నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులు, యంగ్‌ఇండియాతో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు అధికారులు. మరోవైపు రాహుల్‌ ఈడీ విచారణ సందర్భంగా.. దేశం మొత్తం కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్‌ బయట కూడా భారీ పార్టీ శ్రేణులతో నిరసనల మధ్యే రాహుల్‌ గాంధీ లోపలికి ప్రవేశించారు. అనుమతి నిరాకరణతో ఆయన ఒక్కరే లోపలికి వెళ్లారు. మరోవైపు చాలాచోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్టుల పర్వం జరిగింది. రాహుల్‌తో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లిన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా.. అరెస్ట్‌ అయి తుగ్లకు రోడ్‌ జైల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించారు కూడా.

ఇక కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు.. ‘నేను సావర్కర్‌ని కాదు, రాహుల్‌ గాంధీని’ అంటూ నినాదాలు చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి దర్యాప్తు సంస్థ కార్యాలయం వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, ఢిల్లీ పోలీసులు అక్బ‌ర్ రోడ్‌లోని కాంగ్రెస్ కార్యాల‌యం వ‌ద్ద 144 సెక్ష‌న్‌ను విధించారు. అయితే రాజధానిలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో నిరసరకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యాల‌యానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను, బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. బుల్డోజ‌ర్లు ఒక్క‌టే మిస్ అయ్యాయ‌ని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. మైనారిటీ మ‌తాన్ని ఆచ‌రించే వ్య‌క్తుల‌ను, ఇండ్ల‌ను ధ్వంసం చేసే ప‌నిలో బుల్డోజ‌ర్లు బిజీగా ఉండి ఉంటాయ‌ని ఘాటుగా స్పందించారు. ఇక, రాహుల్‌ గాంధీపై ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మరోవైపు.. ఇదే కేసులో జూన్ 23న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here