More

  బిగ్ మిస్టేక్ బై రాహుల్..?

  రాజకీయాల్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడాలి. బయాసుడ్ గా మాట్లాడితే జనంలో చులకనవ్వుడూ ఖాయం.!  అందుకే నేమో..! ఈ మధ్య దేశంలో కార్టూన్ నెట్ వర్క్ చూసే చిన్నపిల్లాడితో మొదలు పెడితే..,  బస్తీల్లోని అరుగులపై కూర్చొని పిట్టకథలు చెప్పే ఓపినియన్ లీడర్ల వరకు..! అందరి నోట్లో ఇప్పుడూ పప్పు జోక్స్ బాగా ఫేమస్ అయ్యాయి. పప్పు… ఎవరని మాత్రం నన్ను అడగవద్దు ప్లీజ్!  

  అందుకేనేమో…! నరం లేని నాలుకా…,  జార భద్రం..! చూసి మాట్లాడాలని మన పెద్దలు చెబుతుంటారు. కానీ ఏం చేస్తాం.! కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇప్పుడు పెద్దల మాటలు పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. దాంతో సీనియర్ కాంగ్రెస్ పెద్దలు సైతం… జీ-23 పేరుతో సరికొత్త గ్రూప్ ను కట్టేశారు.! సోనియా, రాహుల్ తీరుపై అదేపనిగా కౌంటర్లు విసురూతున్నారు.

  ఇక… ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ బార్ అయినా..,  స్టీల్ యాంగ్ లూక్ కోసం రాహుల్ ఇప్పుడూ గెటఫ్ కూడా మార్చేశాడు. అయితే ఏం లాభం..! గేటఫ్ మార్చేస్తే సరిపోదు…, కాసింత సెన్స్ కూడా ఉండాలని కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సబ్జెక్ట్ తెలియకపోతే…తెలుసుకోవాలి.! స్టడీ చేయాలి..! దానిపై గ్రిప్ పెంచుకున్న తర్వాత తన ఒపినియన్ ను బయట పెట్టాలి. సామాన్య బుద్దిజీవులు అందరూ ఇదే చేస్తారు. కానీ ఏం చేస్తాం!  

  ఇక అసలు విషయానికి వద్దాం.! రాహుల్ గాంధీ…అమెరికాకు చెందిన కొంతమంది విదేశీ ప్రొఫెసర్లతో జరిగిన ఓ వెబ్ నార్ లో నోటికివచ్చినట్లుగా మాట్లాడాడని విషయాన్ని ఓపీ ఇండియా అనే వెబ్ పోర్టల్ బయటపెట్టింది. అంతేకాదు ఆ వెబ్ నార్ లో చాలా మంది కాంగ్రెస్ అనుకూలవాదులే ఉన్నారని కథనం ద్వారా తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీ చెప్పుకుంటూ పోయాడు… ఆర్ఎస్ఎస్… భారతీయ విద్యావిధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని.., పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు ఎలాగైతే మదార్సాలు నిర్వహిస్తారో… ఆర్ఎస్ఎస్ కూడా స్కూళ్లను నిర్వహిస్తోందని అర్థంపర్థం లేని తప్పుడు ఆరోపణలు చేశాడు.

  రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ గురించి మాట్లాడడం.., వాటిని ఆ వెబ్ నార్ లోని వారు తందాన అనడం.. చూస్తూంటే ఈ వెబ్ నార్ కేవలం రాహుల్… ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా రూపొందించిన కార్యక్రమంగా చూసేవారందరికి ఇట్టే అర్థమైపోతుంది.

  ఇక దేశ సమస్యలపై వన్ టు వన్ మీడియా డిష్కర్షన్ చేసేందుకు రాహుల్ గాంధీ ఎన్నడూ కూడా ధైర్యం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఒక వేళా… ధైర్యం చేసినా కూడా…,  అందులోనూ ప్రొ కాంగ్రెస్ సెలెక్టివ్ జర్నలిస్టులతో మాత్రమే ఆయన మాట్లాడుతారు. అంతేకాదు ప్రెస్ మీట్ పెట్టిన కూడా…,  రాహుల్ ను ఎవరు ఏమి అడగాలి..? అదంతా కూడా ఒక ఫిక్సుడు ప్రొగ్రామ్ మాదిరిగా ఉంటుంది.!

  పోనీ… అమెరికా స్టయిల్లో… ఎలాగైతే అక్కడి ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు మీడియా ముందుకు వచ్చి  ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను ఎలాగైతే వెళ్లాడిస్తారో అలాంటి కార్యక్రమే మన దేశంలోని మీడియా చానళ్లు ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చినా… రాహుల్ వస్తాడా అంటే డౌటే..! 2014 ఎన్నికలకు ముందు రాహుల్ ను వన్ టు వన్ ఇంటర్వ్యూ చేసింది ఒకే ఒక జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి.! ఇక ఆ తర్వాత రాహుల్ గాంధీ మళ్లీ వన్ టు వన్ ప్రత్యేక ఇంటర్వ్యూ  ఏ జర్నలిస్టుకు ఇచ్చింది లేదు.  

  ఆర్ఎస్ఎస్… ప్రపంచంలోనే అతి పెద్ద స్వయం సేవకుల సంస్థ. గత 90 ఏళ్ళుగా నవభారత నిర్మాణం కోసం తనదైన నిర్మాణాత్మక పాత్రను ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది. వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుంది. భారత రత్న.. భీమ్ రావు రాంజీ అంబేద్కర్, అలాగే మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే…ఇటీవలే కన్నుమూసిన భారత రత్న…మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు అందరూ కూడా జాతి పునర్నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పోషిస్తున్న పాత్రను ప్రశంసించినవారే.!  కాంగ్రెస్ లో సుదీర్గకాలం పనిచేసి.. ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ప్రణబ్ దాదా… నాగ్ పూర్ కేంద్ర కార్యాలయాన్ని సైతం సందర్శించారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల దీక్షాంత సమరోప్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ప్రణబ్ దాదా ఆర్ఎస్ఎస్ ను దేశభక్తులు నిర్మాణం చేసే సంస్థగా గుర్తించారు. ప్రణబ్ దాదా కంటే కూడా…రాహుల్ గాంధీ అపర మేధావా? భారత రాజకీయాలను అవపోసన పట్టాడా? ప్రజా జీవితంలో ఆయన అనుభవం ఎంత? తమ పూర్వీకుల కంచుకోటగా ఉన్న సొంత నియోజకవర్గం అమెథిలో ఓడిపోయి… కేరళలోని వయానాడ్ నియోజకవర్గానికి పలాయనమైన తీరు దేశ ప్రజలందరికి కూడా గుర్తు..! రాహుల్ గాంధీ చేస్తున్న అసత్య ప్రచారాలపై  దేశ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. 

  ప్రస్తుతం దేశంలోని అత్యున్నత పదవుల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా శిక్షణ పొందినవారున్నారనే విషయం రాహుల్ మార్చిపోరాదు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ.., హోమంత్రి అమిత్ షా, ఇలా అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తమ చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ శిక్షణ పొందినవారే.

  ఆర్ఎస్ఎస్… మానవత్వాన్ని, సామాజిక స్ఫూర్తిని, బాధ్యతను, నైతిక విలువలను..భారతీయ సాంస్కృతిక గత వైభవాన్ని నేర్పిస్తుంది. భారత పునర్ వైభవ సాధన యజ్ఞంలో లక్షలాది మంది స్వయం సేవకులు తమ జీవితాలను అర్పిస్తున్నారు. సామాజిక సేవా కార్యంలో నిమగ్నమై పనిచేస్తున్నారు.

  జస్ట్ పేరు చివరన గాంధీ ఉంటే చాలూ…, అదే తమ పొలిటికల్ ట్రేడ్ మార్కని.., ఈజీగా భారత దేశానికి పాలకుడిని కావొచ్చు అనే డైనాస్టీ మైండ్ సెట్ నుంచి రాహుల్ గాంధీ బయటపడాలి. అలాగే రాహుల్ ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లి అక్కడ ఏం నేర్పిస్తున్నారో చూసి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏం చేస్తాం…రాహుల్ చుట్టూ లెఫ్టిస్టులే ఉన్నారని ఒక టాక్.! పీడీవాదంతో ఎలాగో తమ పుట్టిని ముంచ్చుకున్నారు..! కాంగ్రెస్ అనే పుట్టిని రాహుల్ చేతనే ముంచివేయించడం ఖాయమా? కాలమే చెబుతుంది. 

  Related Stories