More

  దేశ అంతర్గత విషయాలు..US రాయబారి ముందు పెట్టిన రాహుల్

  అంటేనేమో అన్నారంటారు? ఏళ్లు పెరిగితే చాలదు..! కాసింత కామన్ సెన్స్ కూడా ఉండాలని పెద్దలు ఊరకనే అనలేదు..! ఏది మంచి..? ఏదీ చెడు..? వంటి విషయాలు చూసి తెలుసుకోవాలి? ప్రతిది పూసగుచ్చినట్లు ఎవరూ వివరించి చెప్పరు..! సమాజం తీరును చూసి అర్థం చేసుకోవాలంతే..!

  ఏం చేస్తాం..! మన దేశానికి ఇదేం శాపమో..! తెలియదు కానీ..135 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అధినేత..50 పదుల దాటినా కూడా, ఆ పార్టీ కార్యకర్తల చేత ఇంకా కూడా యువరాజు అని పిలిపించుకునే నేతకు., కాసింత కూడా భారత దేశ స్వాభిమానం అనేది లేదా?

  భారత దేశ ఇంటర్నల్ మ్యాటర్స్ పై విదేశీయులతో చర్చ చేయడమే కాకుండా.., ఏకంగా ఓ రాయబారిని మీరు మా దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోలేరా? ఎందుకు మౌనంగా ఉన్నారేందుకు అంటూ ప్రశ్నించాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.! రాజకీయాల్లో పార్టీల మధ్య వైరం ఉంటుంది. పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ప్రభుత్వ తీరును ఎండగట్టం ప్రతిపక్షం బాధ్యత. కనీసం ఆ బాధ్యతను కూడా కాంగ్రెస్ సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. మోదీ అమిత్ షా వ్యూహాలను ఎదుర్కొనలేక చేతులుఎత్తేసిన రాహుల్ గాంధీ..ఇలా విదేశీయులతో కూడా చేతులు కలుపుతాడా? వారితో భారత అంతర్గత విషయాలు బహిరంగంగా చర్చించి అంతర్జాతీయ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?  

  మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.., కాంగ్రెస్ పార్టీ… ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అయ్యింది. తమ పూర్వీకుల కాలం నుంచి గెలుస్తూ వస్తున్న అమెథీ నియోజకవర్గంలో సైతం రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యాడు. యూపీని వదలి కేరళలోని వయనాడ్ పలాయనం అయ్యాడని ఈ విషయంలో బీజేపీ నేతలు రాహుల్ ను విమర్శిస్తుంటారు కూడా!

  ఓకే… మోదీ అంటే మీకు పడదు.! అంతమాత్రాన…ఆయన్ను గద్దెదించేందుకు విదేశీయులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయడం ఏంటీ?  చరిత్రలో కూడా పృధ్వీరాజ్ చౌహాన్ అంటే పడని రాజా జయచంద్రుడు… పృధ్వీరాజ్ మీద కోపంతో మహమ్మద్ ఘోరీని భారత దేశంపై దండయాత్రకు ఆహ్వానించాడు. పృధ్వీరాజ్ ను ఓడించేందుకు సాయం కూడా చేశాడు. తీరా యుద్ధంలో గెలిచినా తర్వాత అదే ఘోరీ…, రాజా జయచంద్రుడిని సైతం ఓడించి అతన్ని…, అతని రాజ్యాన్ని ఖతం చేశాడు.!

  భారత్ ఒక సార్వభౌమాధికార దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలే అంతిమ నిర్ణేతలు. తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారు. ప్రధాని మోదీ… తల్లి పేరు, తండ్రి పేరు చెప్పుకుని వారసత్వ రాజకీయాల ద్వారా భారత రాజకీయాల్లోకి రాలేదు. స్వయంకృషితో ప్రధాని స్థాయికి ఎదిగాడు. కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా ఒక్కొ అడుగు వేస్తున్న మోదీ ప్రభుత్వమంటే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు కోపం ఉండటం సహజం! ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాటం చేయాలికానీ… మా దేశంలో జరుగుతున్న పరిణమాలపై మీరు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. మీరు మౌనంగా ఉన్నారేందుకు అంటూ అమెరికా రాయబారి నికోలస్ బర్నస్స్ తో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇంకా ఈ సమావేశంలో రాహుల్.., బీజేపీపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ బీజేపీ తన గుప్పిట పట్టిందని ఆరోపించాడు.

  అయితే రాహుల్ గాంధీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత అంతర్గత విషయాలు…విదేశీయులతో మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రజలారా రాహుల్ గాంధీ గురించి మీకు అర్థమౌతోందా?

  Trending Stories

  Related Stories