National

అవును.. ఆ హీరోయిన్లు డ్రగ్స్ తీసుకున్నారు..!

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, హీరోయిన్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వార్తలు దేశంలో సంచలనం రేపాయి. పలు భాషల్లో నటించిన రాగిణి ద్వివేది, సంజనాలు గత సంవత్సరం డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఉన్న సమయంలోనే డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చింది.. ముంబై నుండి బెంగళూరు వరకూ లింక్స్ బయటపడ్డాయి. ఇక డ్రగ్స్ కేసు నుండి తప్పించుకోడానికి రాగిణి ద్వివేది, సంజనాలు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.

ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎన్ సీబీ అధికారులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరులోని బాణసవాడి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారుల చేతికి వెళ్లిపోయింది. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మొదట బెంగళూరులోని జయనగర ఆర్ టీఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న రవిశంకర్ ను అరెస్టు చేశారు. రవిశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు రాగిణి దివ్వేది అరెస్టు అయ్యారు. ఆ తర్వాత పలువురి పేర్లు వినిపించాయి. బుజ్జిగాడు ఫేమ్ సంజనా కూడా అరెస్టు అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులు జైల్లో ఉండగా.. ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్నారు.

తాజాగా వీళ్లు డ్రగ్స్ తీసుకున్నారని బయటపడింది. రాగిణి, సంజనాతో పాటు ఈ కేసులోని నిందితులు అందరూ తాము డ్రగ్స్ సేవించలేదని చెప్పారు. అందరి తల వెంట్రుకలు సేకరించి హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. హీరోయిన్లు రాగిణి దివ్వేది, సంజానా, వీరేన్ ఖన్నా, రవిశంకర్, రాహుల్ తదితరులు పక్కాగా డ్రగ్స్ సేవించారని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలలో తేలిందని కన్నడ మీడియా చెబుతోంది. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్.ఎస్.ఎల్. రిపోర్ట్ తేల్చేసింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్.ఎస్.ఎల్ కు బెంగుళూరు పోలీసులు పంపారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ రిపోర్టుతో హీరోయిన్లతో పాటు అందరూ డ్రగ్స్ సేవించారని వెలుగు చూసిందని క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమీషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. మొదట బ్లడ్, యూరిన్ నమూనాలను వీరి నుండి సేకరించి ల్యాబ్ కు పంపిన పోలీసులు, వాటిలో ఫలితం సరిగ్గా తేలకపోవడంతో వెంట్రుకల నమూనాలను సేకరించారు. రాగిణి, సంజన ల వెంట్రుకల నమూనాలను హైదరాబాద్‌ నగరం లోని ఎఫ్.ఎస్.ఎల్ కు పంపారు. పరిశోధనల్లో డ్రగ్స్ సేవించినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో మరోసారి ఇద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 2 =

Back to top button