Telugu States

రఘురామ కృష్ణరాజు విడుదలపై జరుగుతున్న జాప్యం

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిలుపై జాప్యం కొనసాగుతోంది. ఆయన సోమ‌వారం విడుద‌ల‌య్యే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రఘురామకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు ఎంపీ న్యాయ‌వాదుల‌కు ఇంకా అంద‌ని నేప‌థ్యంలో ఆయ‌న‌ విడుద‌ల ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలిసింది. కింది కోర్టులో సోమ‌వారం పూచీక‌త్తు స‌మ‌ర్పించేందుకు ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ర‌ఘురామ‌ రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఆయ‌న సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుప‌త్రిలోనే ఉన్నారు.

శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం రఘురామ కృష్ణ రాజుకు బెయిల్ ను మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని సూచన చేసింది. రఘురామ కృష్ణరాజు దర్యాప్తును ప్రభావితం చేయకూడదని సుప్రీం తెలిపింది. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చెప్పింది. ఎంపీ తరఫున ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామ కృష్ణ రాజుకు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని… విచారణకు సంబంధించిన నోటీసును కూడా అధికారులు ఆయనకు 24 గంటల ముందుగానే ఇవ్వాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రాఘురాజు సహకరించాలని ఆదేశించింది. రఘురాజు మీడియా ముందుకు రాకూడదని.. ఈ కేసుకు సంబంధంచి ఏమీ మాట్లాడకూడదని తెలిపింది. తనకు అయిన గాయాలను గతంలో చూపించినట్టుగా ఎక్కడా ప్రదర్శించకూడదని ఆదేశించింది. సోషల్ మీడియా ఎదుటకు కూడా రాకూడదని తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × three =

Back to top button