Telugu States

రఘురామకు బెయిల్.. నో ఇంటర్వ్యూస్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం రఘురామ కృష్ణ రాజుకు బెయిల్ ను మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పును ఇచ్చింది. రఘురామ కృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని సూచన చేసింది. రఘురామ కృష్ణరాజు దర్యాప్తును ప్రభావితం చేయకూడదని సుప్రీం తెలిపింది. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చెప్పింది. ఎంపీ తరఫున ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామ కృష్ణ రాజుకు బెయిల్‌ను మంజూరు చేసింది.
విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని… విచారణకు సంబంధించిన నోటీసును కూడా అధికారులు ఆయనకు 24 గంటల ముందుగానే ఇవ్వాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రాఘురాజు సహకరించాలని ఆదేశించింది. రఘురాజు మీడియా ముందుకు రాకూడదని.. ఈ కేసుకు సంబంధంచి ఏమీ మాట్లాడకూడదని తెలిపింది. తనకు అయిన గాయాలను గతంలో చూపించినట్టుగా ఎక్కడా ప్రదర్శించకూడదని ఆదేశించింది. సోషల్ మీడియా ఎదుటకు కూడా రాకూడదని తెలిపింది. విచారణను ప్రభావితం చేసే పనులు చేయకూడదని చెప్పింది.
రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఎక్కువసేపు కొనసాగాయి. రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించిన అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనల మధ్యలో జోక్యం చేసుకున్న సుప్రీం ధర్మాసనం వాదనలు త్వరగా వినిపించాలని దవేకి స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 3 =

Back to top button