కొద్దిరోజుల కిందట నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్చ్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో ఆయన మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ రఘురామను ఈ నెల 14న అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను గుంటూరు తరలించి కోర్టులో హాజరుపరిచారు. పోలీసు కస్టడీలో తనను తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఎంపీ రఘురామ కోర్టులో పిర్యాదు చేయడం సంచలనంగా నిలిచింది. సీఐడీ అధికారులు కొట్టడం వల్లే గాయాలయ్యాయని సుప్రీంను ఆశ్రయించడంతో ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలకు కావాల్సిన ప్రక్రియ అంతా ఆయన తరఫు న్యాయవాదులు పూర్తి చేశారు. గత వారం రోజులుగా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందిన రఘురామ ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఎంపీ రఘురామను ఈ నెల 14న అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను గుంటూరు తరలించి కోర్టులో హాజరుపరిచారు. పోలీసు కస్టడీలో తనను తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఎంపీ రఘురామ కోర్టులో పిర్యాదు చేశారు. రఘురామ కృష్ణ రాజు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో గుంటూరు సీఐడీ కోర్టులో బెయిల్ తీసుకోవాలని సూచించింది. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలని.. న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని సూచన చేసింది. రఘురామ కృష్ణరాజు దర్యాప్తును ప్రభావితం చేయకూడదని సుప్రీం తెలిపింది. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చెప్పింది.