మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు. ఎమ్మెల్యేలకు 400 కోట్లు ఇవ్వజూపారని తెలిసిందని, పోలీసులు అరెస్ట్ చేసినవారి గురించి, సీజ్ చేసిన డబ్బు గురించి చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు లావాదేవీలు, నేరాన్ని రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని గుర్తుచేశారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో డబ్బు గురించి చెప్పలేదన్నారు. ఒకేసారి 2లక్షల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తే.. మనీలాండరింగ్ కిందకు వస్తుందని రఘునందన్‌రావు తెలిపారు.