More

    మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చేరడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

    తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చేరడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఐటీ దాడులు జరిపినప్పుడల్లా గుండెపోటు వచ్చిందని అందరూ ఆసుపత్రుల్లో చేరుతుంటారని… ఇది సాధారణ విషయమేనని చెప్పారు. మహేందర్ రెడ్డి నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారని… ఐటీ రెయిడ్స్ ప్రారంభం కాగానే ఆయనకు గుండెపోటు ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి తన ఫోన్ ను దాచి పెట్టారని, అయినా ఐటీ అధికారులు ఆ ఫోన్ ను కనిపెట్టారని చెప్పారు. తప్పులు చేయకపోతే ఫోన్ దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని… దీనిపై ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని అన్నారు.

    కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదని.. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారని అన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories