More

  దసరా శుభాకాంక్షలు చెప్పిన షమీ..! ఫత్వా లోడవుతుందంటూ బెదిరింపులు..!!

  దసరా శుభాకాంక్షలు పంచుకున్న భారత క్రికెటర్ మహ్మద్ షమీని మతోన్మాదులు టార్గెట్ చేశారు. హిందూ పండుగకు శుభాకాంక్షలు తెలియజేయడం ఈ నేరగాళ్లకు మహానేరంగా కనిపించింది. టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి క్రికెటర్ మహ్మద్ షమీ దసరా శుభాకాంక్షలు పోస్ట్ చేశాడని ఇస్లాం వాదులు ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారు. షమీ షేర్ చేసిన పోస్ట్‌ను ఇస్లామిక్ నెటిజన్లు తప్పుపడుతూ శాపనార్థాలు పెడుతున్నారు.

  చెడుపై మంచి సాధించిన విజయమే పండుగ దసరా. విజయదశమి అంటే విజయాల పరంపరకు నాంధీగా భావిస్తారు. ధర్మ విజయాన్ని సూచించే దసరా పండువను హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. రావణ సంహారమైనా, మహిషాసుర మర్థనమైనా, పాండవుల శమీ పూజలైనా.. అన్నీ ధర్మ విజయాన్ని, అధర్మాన్ని తరిమికొట్టడాన్ని సూచించేవే.

  పౌరులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలామంది ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు వెళ్లగా, ప్రస్తుతం టి 20 ప్రపంచ కప్ ఎంపికల కోసం వార్తల్లో ఉన్న క్రికెటర్ మహ్మద్ షమీ సైతం ఈ సందర్భంగా శుభాకాంక్షలను పంచుకున్నారు. దీనిపై, ఇస్లామిస్టులు చిలవలు పలవలు పెట్టడం మొదలెట్టారు.

  శ్రీరాముడు రావణుడిని చంపిన చిత్రాన్ని మహమ్మద్ షమీ విజయదశమినాడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. దసరా శుభ సందర్భంగా, రాముడు మీ జీవితంలో శ్రేయస్సు, విజయం ఆనందం నింపాలని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అని షమీ ట్వీట్ చేశారు.

  షమీ షేర్ చేసిన పోస్ట్‌ను ఇస్లామిక్, రాడికల్ నెటిజన్లు నిరసిస్తూ.. దసరా శుభాకాంక్షలు పంచుకోవడం పాపమని సూచించారు. షమీ పోస్ట్‌పై అకీల్ భట్టి అనే ట్విటర్ వినియోగదారుడు, ముస్లింలకు అప్రతిష్ట తెచ్చాడని వ్యాఖ్యానించారు. ఇబ్న్-ఎ-అహ్మద్ అనే ట్విట్టర్ యూజర్.. తన అక్కసును మరో రీతిలో వ్యక్తపర్చాడు. T20 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టులో భాగమయ్యేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించాడు. అమన్ మీర్జా అనే వ్యక్తి క్రికెటర్ మతిస్థిమితం కోల్పోయాడని పేర్కొన్నాడు. అజ్ఞాని, మూర్ఖులు అని ఘనమైన పేర్లు తెచ్చుకున్న కొందరు ఇస్లాంవాదులు.. ఫత్వా లోడ్ అవుతోందని షమీకి బెదిరింపులు చేస్తున్నారు.

  కోవిడ్-19 వైరస్ సోకిన తర్వాత క్రికెటర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఆరోగ్యం మెరుగుపడినట్లు సానుకూల సంకేతాలను చూపితే షమీని భర్తీ చేసే ప్రకటనను జాతీయ సెలెక్టర్లు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వాయిదా వేయడానికి సిద్ధంగా ఉందని కొందరు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు

  ప్రస్తుతం, షమీ ఫిట్‌నెస్‌కు సానుకూల సంకేతాలను చూపుతున్నప్పటికీ, అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు జరిగే ఛాంపియన్‌షిప్‌కు అతని సంసిద్ధత గురించి సంబంధిత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు పేసర్‌ను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సిందిగా కోరారు.

  Trending Stories

  Related Stories