More

    మళ్లీ మెగాఫోన్ పట్టిన ఆర్.పి.పట్నాయక్!

    ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో.. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా ఆవిష్కరించారు.
    కరోనా ప్యాండమిక్ తరువాత రీ రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్‌లో కనపడుతోంది. నిజమే ఒక కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబోలు అని అర్థమైంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ట్రైలర్ కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూశాక ఆర్.పి హీరో అనిపించింది. ఎందుకంటే.. కథే హీరో కనుక ఆ కథను మలిచింది ఆయనే కనుక. ఆర్.పి ఏ క్రాఫ్ట్‌కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విషయం గురించి ఆర్.పి.పట్నాయక్ ను కదిలిస్తే ఎన్నో విషయాలు చెప్పారు. అవి ఆయన మాటల్లోనే…
    ‘‘ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకొని.. డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. సెట్‌లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది( నవ్వుతూ). కానీ, సతీష్ అలా ఉండడం వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు రాగలిగింది. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రానికి వస్తే.. ఆరిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసినా.. వారి వెంట వచ్చిన అసిస్టెంట్స్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. అది కాకుండా అయితే ఇట్స్ ఎ టీం వర్క్ అని చెప్పాలి. ఈజీగా చేసే సినిమా మాత్రం కాదు అని చెప్పగలను. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది.. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రివీల్ చేస్తాము. ఒక డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాము. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు.

    Trending Stories

    Related Stories