కుతుబ్ మినార్ నిర్మాణంపై ఆసక్తికర విషయాలు..!

0
1065

మొన్న ఆయోధ్య.. నిన్న జ్ఞానవాపి.. నేడు మథుర మసీదు.. రేపు కుతుబ్ మినార్. ఒకప్పుడు హిందూ దేవాలయాలు ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం మసీదుల నిర్మాణం జరిగిందని ఆధారాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీలోని కుతుబ్ మినార్ ను ఎవరు నిర్మించారు..? అనే చర్చ జరుగుతోంది. సూర్యుడి క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలించేందుకు కుతుబ్ మినార్‌ను ఐదో శ‌తాబ్ధంలో రాజా విక్ర‌మార్క నిర్మించాడ‌ని ఆర్కియలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా మాజీ ప్రాంతీయ డైరెక్ట‌ర్ ధ‌రంవీర్ శ‌ర్మ చెప్పారు. సూర్యుడు ఏ దిశ‌లో ప‌య‌నిస్తున్నాడ‌నేది అధ్య‌య‌నం చేసేందుకు కుతుబ్ మినార్‌ను రాజా విక్ర‌మార్క నిర్మించాడ‌ని, దీన్ని కుతుబ్ అల్ దిన్ అలిబ‌క్ నిర్మించ‌లేద‌ని శ‌ర్మ స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించి త‌న వ‌ద్ద ప‌లు ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఏఎస్ఐ త‌ర‌పున తాను ప‌లుమార్లు కుతుబ్ మినార్‌ను స‌ర్వే చేశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంద‌ని, ఇది సూర్యుడిని గమనించడానికి ఏర్పాటు చేశార‌ని అన్నారు.

అందుకే జూన్ 21 న సూర్యాస్తమయం స‌మ‌యంలో కనీసం అరగంట పాటు నీడ ఆ ప్రాంతంపై పడద‌ని ఇది సైన్స్‌, పురావ‌స్తు వాస్తవం అని వివ‌రించారు. కుతుబ్ మినార్ స్వ‌తంత్ర క‌ట్ట‌డమ‌ని, స‌మీపంలోని మ‌సీదుతో దీనికి ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. కుతుబ్ మినార్ త‌లుపు ఉత్త‌ర భాగాన ఉంద‌ని, రాత్రి వేళ ఆకాశంలో ధ్రువ‌న‌క్ష‌త్రాన్ని వీక్షించేలా ఈ ఏర్పాటు చేశార‌ని ధ‌రంవీర్ శ‌ర్మ తెలిపారు. మరోవైపు కుతుబ్‌ మినార్‌ సమీపంలో ఖువాత్‌ -ఉల్‌-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కే.కే. మహమ్మద్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మహమ్మద్‌ ఈ విషయాలు వెల్లడించారు. కుతుబ్‌ మినార్‌ సమీపంలో గణేశ దేవాలయంతో సహా అనేక దేవాలయాల అవశేషాలు బయటపడ్డాయని తెలిపారు. అక్కడ ఒక దేవాలయం ఉండేదని రుజువు కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఢల్లీ టూరిజం వెబ్‌సైట్‌లో 73 మీటర్ల ఎత్తైన కుతుబ్‌ మినార్‌ను 27 హిందూ, జైన దేవాలయాల నుండి పొందిన వస్తువులను ఉపయోగించి నిర్మించినట్లు స్పష్టంగా చేశారు. ఢల్లీ మొదటి ముస్లిం పాలకుడు, కుతుబ్‌- ఉద్‌-దిన్‌ ఐబక్‌ ఢల్లీ చివరి హిందూ పాలకుడు పృథివీరాజ్‌ చౌహాన్‌ను ఓడించాడని, దీని తూర్పు ద్వారంపై ఉన్న ఒక శాసనంలో 27 హిందూ దేవాలయాలను కూల్చి ఆ వస్తువులతో మసీదు నిర్మించినట్టు వెబ్‌సైట్‌లో ఉంటుందని చెప్పారు. అక్కడ మసీదు నిర్మించడానికి 27 హిందూ దేవాలయాలను కూల్చడంతో ముస్లిం మసీదుకు విలక్షణమైన హిందూ అలంకారాలు ఉన్నాయని తెలిపారు. కుతుబ్‌ మినార్‌ నిర్మాణాన్ని క్రీ.శ.1200లో ఐబాక్‌ ప్రారంభించాడని అన్నారు. అయినప్పటికీ, అతను నేలమాళిగను మాత్రమే పూర్తి చేశాడని… అతని వారసుడు ఇల్‌తుత్‌మిష్‌ నిర్మాణానికి మరిన్ని అంతస్తులను నిర్మించారని చెప్పారు. తరువాత 1368లో, ఫిరోజ్‌ షా తుగ్లక్‌ భవన చివరి అంతస్తును నిర్మించాడని చెప్పారు. మసీదు ఉన్న స్థలంలో చాలా వినాయకుడి విగ్రహాలు కనిపించాయని వెల్లడించారు. ఇది పృథ్వీరాజ్‌ చౌహాన్‌తో సహా చుహాన్‌ల రాజధాని అని చెప్పారు. దాదాపు 27 హిందూ దేవాలయాలు ఉన్నాయన్నారు. ఆ స్థలంలో మసీదు నిర్మించేందుకు 27 దేవాలయాలను ధ్వంసం చేసినట్లు అరబిక్‌ శాసనాల ద్వారా స్పష్టంగా ఆధారాలు కనుగొనవచ్చని పేర్కొన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here