More

    కార్మికులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఖతార్

    ఖతార్ అధికార యంత్రాంగం కార్మికులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తూ ఉంది. విదేశీ కార్మికులపై ఖతార్ అధికారులు దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారు. రాజధాని దోహాలో ఉన్న విదేశీ కార్మికులను ఉన్నపళంగా ఖాళీ చేయిస్తోంది. నవంబర్ నెలలో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరుగుతూ ఉండడంతో.. పలు ప్రాంతాలలో అర్ధరాత్రి అని కూడా చూడకుండా కార్మికులను ఖాళీ చేయిస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫుట్ బాల్ ప్రపంచకప్ కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. నవంబర్ 20 నుంచి ప్రపంచ కప్ జరగనుంది. ఈ మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సాకర్ అభిమానులు తరలి వస్తున్నారు. వీరికి వసతి కల్పించడం సమస్యగా మారింది. దీంతో, దోహాలో ఉన్న విదేశీ కార్మికులను ఖాళీ చేయిస్తున్నారు.

    విదేశీ కార్మికుల పట్ల ఖతార్ వ్యవహరిస్తున్న తీరు, అక్కడి చట్టాలపై అంతర్జాతీయంగా విమర్శలకు తావిస్తోంది. దోహాలోని అల్ మన్సౌరా జిల్లాలో 1,200 మంది నివాసితులు ఉన్నారని.. అధికారులు రాత్రి 8 గంటలకు వచ్చి ప్రజలను రెండు గంటల టైమ్ ఇస్తున్నామని వెళ్లిపోవాలని హెచ్చరించారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి అందరినీ బలవంతంగా బయటకు పంపి తలుపులకు తాళాలు వేశారు. కొందరికి కనీసం తమ లగేజీని సర్దుకోడానికి కూడా సమయం ఇవ్వలేదు.

    Trending Stories

    Related Stories