More

  తాలిబాన్ నేతలతో భారత అధికారుల చర్చలు

  తాలిబాన్ రాజకీయ నేతలతో మాట్లాడటానికి భారత అధికారులు దోహాకు వెళ్లారు. ఈ “నిశ్శబ్ద పర్యటన” గురించి ఖతారీ సీనియర్ అధికారి తెలిపారు. తాలిబాన్లను భారత్ అధికారులు నేరుగా కలిశారని ఇటీవల వార్తలు రాగా.. ఇప్పుడు ఖతార్ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాలిబాన్లతో మాట్లాడటానికి భారత అధికారులు దోహాను సందర్శించారని మాకు అర్థమైంది అని ఖతార్ ప్రత్యేక రాయబారి, కౌంటర్ టెర్రరిజం మీడియేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అయిన ముత్లక్ బిన్ మజేద్ అల్ ఖహ్తాని సోమవారం ఒక వెబ్ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.

  గత రెండు వారాల్లో రెండుసార్లు ఖతారీ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దోహాలో కలిశారు. ఈ సమాశాలు ముగిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది. కహ్తానీ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ (ఎంఈఏ) నిరాకరించింది. దోహాలో ఉన్న తాలిబాన్ రాజకీయ నాయకులతో సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అనే విషయాలపై స్పందించలేదు.

  ఖహ్తాని మాట్లాడుతూ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తులో “కీలక” పాత్ర ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తాలిబాన్ ఆధిపత్యం చెలాయించబోతున్నారని భావించకూడదని.. అయితే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తులో ఒక ముఖ్య భాగమని అన్నారు. చర్చలు జరపడానికి ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని పార్టీలకు హక్కులు ఉన్నాయని.. వారి వారి కారణాలు కూడా ఉంటాయని అన్నారు. “యుఎస్-నాటో ఉపసంహరణ తరువాత ఆఫ్ఘనిస్తాన్ శాంతి వైపు చూడటం” అనే అంశంపై వాషింగ్టన్ లోని అరబ్ సెంటర్, దోహాలోని సెంటర్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ హ్యుమానిటేరియన్ స్టడీస్ నిర్వహించిన సమావేశంలో మిస్టర్ కహ్తాని మాట్లాడారు.

  యుఎస్-నాటో దళాలు వైదొలగడానికి ముందు మారుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించడానికి ఈ శుక్రవారం వాషింగ్టన్ లో యుఎస్ అధ్యక్షుడు బిడెన్‌ను కలవడానికి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అక్కడ కొన్ని సమావేశాల్లో ప్రసంగించనున్నారు.

  ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశలో ఉన్నామని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఏదైనా సమావేశాలు జరిగితే, శాంతియుత మార్గాల ద్వారా వారి విభేదాలను పరిష్కరించడానికి (ఆఫ్ఘన్-తాలిబాన్) పార్టీలను ప్రోత్సహించాలి. అందరూ చర్చలకు తిరిగి రావడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఒక దేశాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోబోడాన్ని ఖతార్ తో సహా ఎవరూ గుర్తింపును ఇవ్వరు అని కహ్తాని తెలిపారు. సెప్టెంబర్ నెలలో యుఎస్-నాటో దళాలను వెనక్కు పిలిపించిన తరువాత తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో హింసాత్మక ధోరణిలో ముందుకు వెళుతూ.. అధికారం స్వాధీనం కోసం ప్రయత్నించవచ్చనే ఆందోళనలను కూడా కహ్తాని వ్యక్తం చేశారు.

  భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు ఆఫ్ఘన్ సయోధ్య ప్రక్రియతో ముడిపడి ఉన్నాయా అనే ప్రశ్నకు, కహ్తాని మాట్లాడుతూ, “ఒక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఇతర దేశాల కోసం ప్రాక్సీ [పోరాటానికి] చోటుగా మారకూడదు. స్థిరమైన ఆఫ్ఘనిస్తాన్ ఉండాలని పాకిస్తాన్, భారతదేశం కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ పొరుగు దేశం. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కు ఆర్థికంగా ఎంతో సహాయపడిందని మాకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ శాంతియుతంగా మరియు స్థిరంగా ఉండాలని భారత్ కోరుకుంతుంది” అని అన్నారాయన.

  ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడిన మిలిటెంట్ గ్రూపును గుర్తించడానికి కొన్నేళ్లుగా నిరాకరించిన తరువాత.. తాలిబాన్లకు మోదీ ప్రభుత్వం కొత్తగా, ప్రత్యక్షంగా చేరువ కావాలని ప్రయత్నిస్తున్న మీడియా నివేదికలపై ఎంఈఏ ప్రతినిధి స్పందించారు. న్యూ ఢిల్లీ ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి, పునర్నిర్మాణం పట్ల ఎంతో కాలంగా నిబద్ధతతో వ్యవహరిస్తోందని, ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి కోసం భారత్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోందని.. అందుకే వివిధ వర్గాలతో సన్నిహితంగా ఉందని తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జూన్ 9, జూన్ 15 న కువైట్, కెన్యా పర్యటనల సందర్భంగా రెండు చిన్న విరామాలలో దోహాను సందర్శించారు. అక్కడ ఖతారీ విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో పాటు యుఎస్ ప్రత్యేక ప్రతినిధితో సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి కోసం ఖతార్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఖతార్ ప్రభుత్వం 2013 నుండి దోహాలో తాలిబాన్ లకు ప్రధాన కార్యాలయానికి ఆతిథ్యం ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించిన ఆఫ్ఘన్-తాలిబాన్ చర్చలకు ఖతార్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది.

  Trending Stories

  Related Stories