More

    సింధుకిచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకున్న ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ భారత ఒలింపిక్స్ బృందంతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే..! ఆటగాళ్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. వందేళ్లలో తొలిసారి భారత్ కు అథ్లెటిక్స్ లో పతకాన్ని అందించడమే కాకుండా స్వర్ణ పతకాన్ని గెలిచిన నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ లో కంచు పతకం గెలిచిన పీవీ సింధు ఇలా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ సింధుకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నారు.

    ప్రధాని మోదీ తన అధికారిక నివాసం 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో భారత ఒలింపిక్ క్రీడాకారుల కోసం పార్టీని నిర్వహించారు. నరేంద్ర మోదీ ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఇచ్చిన ఐస్ క్రీమ్‌ వాగ్దానాన్ని నెరవేర్చారు. అథ్లెట్స్ ఒలింపిక్స్ కి వెళ్లడానికి మందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఆ సమయంలో వారందరి అభిరుచులను మోదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింధుకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని తెలుసుకున్నారు. అప్పుడు పతకం గెలిస్తే ఐస్ క్రీమ్ నీతో కలిసి తింటాను అని మాట ఇచ్చారు. దానిని ఇప్పుడు నిజం చేశారు. టోక్యో బ్యాడ్మింట‌న్‌లో గెలుచుకున్న బ్రాంజ్‌తో పాటు.. గ‌తంలో రియో ఒలింపిక్స్‌లో సాధించిన ప‌త‌కాన్ని కూడా ఈ సంద‌ర్భంగా సింధు త‌న వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధ‌రించి ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఆమె ఫోటో దిగింది.

    దేశానికి స్వర్ణం కల తీర్చిన నీర‌జ్ చోప్రాతో కొద్దిసేపు మోదీ ముచ్చ‌టించారు. అనంత‌రం అత‌నితో క‌లిసి ఫోటో దిగారు. తన‌కు చూర్మ వంట‌కమంటే ఇష్ట‌మ‌ని నీర‌జ్ చెప్ప‌డంతో దాన్ని సిద్ధం చేయించారు మోదీ. టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందం పర్యటించడానికి ముందు, ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లింక్ ద్వారా అథ్లెట్లతో సంభాషించారు. ఆటగాళ్లు ఫిట్ నెస్ ను కాపాడుకోడానికి తమకు ఇష్టమైన తిండిని విడిచిపెడుతున్నారని, అగ్రశ్రేణి అథ్లెట్లు కఠినమైన షెడ్యూల్, హార్డ్ వర్క్ కు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అప్పట్లో చెప్పారు. ఒలింపిక్స్ కు వెళ్లిన భారత బృందంతో ప్రధాని ఆత్మీయ సమావేశముంటుందని గత వారమే ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఎర్రకోటకు వారందరినీ ఆహ్వానించారు. ఇక ప్రధాని ఢిల్లీలోని తన నివాసంలో వారిని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు.

    Trending Stories

    Related Stories