క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన భారత హాకీ జట్టు, పీవీ సింధు

భారత హాకీ జట్టు గ్రూప్ స్టేజ్ లో మూడో విజయాన్ని సాధించింది. మొదటి మ్యాచ్ లో కివీస్ మీద గెలిచిన భారత్.. ఆ తర్వాతి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని అందుకుంది. ఈ ఘోర ఓటమి తర్వాత తేరుకున్న భారతజట్టు వరుసగా రెండు విజయాలు సాధించి గ్రూప్ స్టేజీలో రెండో స్థానంలో నిలిచింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఘన విజయాన్ని అందుకున్న భారత జట్టు.. నేడు పూల్-ఎ లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మూడో క్వార్టర్లో తొలి గోల్ చేసిన టీమిండియా.. నాలుగో క్వార్టర్లో మరో రెండు గోల్స్ చేసి రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అర్జెంటీనాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. భారత్ జట్టు తరపున వి కుమార్, వీఎస్ ప్రసాద్, హర్మన్‌ప్రీత్‌సింగ్‌లు ఆట 43,58,59 వ నిమిషంలో గోల్స్ చేశారు. పూల్-ఎ లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.
భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూఫ్ జెలో రెండు విజయాలతో టాపర్‌గా నిలిచిన పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌లోనూ తన దూకుడు కనబరిచి క్వార్టర్స్‌కు ప్రవేశించింది. డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో వరుస గేమ్‌లలో 21-15, 21-13తో చిత్తుచేసింది. మొత్తం 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 21-15తో 22 నిమిషాల్లోనే కైవసం చేసుకున్న సింధు రెండో గేమ్‌ను 21-19తో 19 నిమిషాల్లోనే ముగించి ఘన విజయాన్ని అందుకుంది. సింధు క్వార్టర్స్‌లో అకానే యమగుచితో తలపడే అవకాశం ఉంది.
ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రౌండ్ ఆఫ్ 16లో కొరియాకు చెందిన ఓహ్ జిన్హీక్పై 6-5 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. జూలై 31న జరగనున్న రౌండ్ ఆఫ్ 8లో అతాను దాస్ జపాన్‌కు చెందిన ఫురుకావా తకహారుతో పోటీ పడనున్నాడు.
బాక్సింగ్ 91 కేజీల విభాగంలో భారత బాక్సర్ సతీష్ కుమార్ జమైకాకు చెందిన బాక్సర్ బ్రౌన్ రికార్డోపై 4-1తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆగస్టు 1న జరిగే క్వార్టర్ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోవ్‌తో తలపడనున్నాడు.