పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. గతంలో కమలాపురం మున్సిపల్ కమిషనర్ గా కూడా మునికుమార్ పని చేశారు.
కడప నగర పాలక కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన మునికుమార్ మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యూటేషన్‌పై బదిలీపై వచ్చారు. ముని కుమార్ రెండు రోజులు సెలవు పెట్టి గురువారం కడపకు వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. నిన్న ఇంటి నుంచి బయలు దేరిన ఆయన ఇవాళ రాయచోటి రైల్వేగేట్ వద్ద శవమై కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ మహమ్మద్ బాబా తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని బంధువులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు.